📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Phone Tapping Case: ట్యాపింగ్ వల్ల శివార్లలో వందల కోట్ల భూదందాలు

Author Icon By Tejaswini Y
Updated: February 5, 2026 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు రాజకీయ నేతలు, బడా బాబులు, సెలబ్రటీల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు, బలవంతపు వసూళ్లు జరిగినట్లు సిట్కు ఆధారాలు లభించగా తాజాగా బిఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్ రావు సహా మరో ప్రముఖ నేతను విచారించిన క్రమంలో రంగారెడ్డి జిల్లాలో వందల కోట్ల రూపాయల భూదందాలు జరిగిన విషయం రట్టయినట్లు తెలిసింది. ఇందులో అప్పటి రంగారెడ్డి జిల్లాలో ఓ ఉన్నతాధికారి సూత్రధారిగా వున్నట్లుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డిజిటల్ ఆధారాలు మిగిలి పోతాయని, వీటిని ఏమీ చేయలేరని, ఇద్దరు బిఆర్ఎస్ మహిళా నేతలు సర్కారును హెచ్చరించిన విషయం కూడా సిట్ విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది.

Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

Phone Tapping Case: Hundreds of crores of rupees of land scams in the suburbs due to tapping

ఈ క్రమంలో నాటి రంగారెడ్డి ఉన్నతాధికారితో పాటు బిఆర్ఎస్
మహిళా నేతలను విచారించేందుకు సిట్ నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో రెండవ సిట్ ఏర్పాట య్యాక జరుగుతున్న ప్రముఖుల విచారణలో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బిఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్ రావు సహా మ రో ప్రముఖ నేతను సిట్ విచారించిన సమయంలో కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా రంగారెడ్డి జిల్లాలో అనేక మంది రియల్టర్లను నాటి ఎస్ఐబి అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి వందల కోట్ల రూపాయల భూదందాలకు పాల్పడినట్లు నిర్దారణ అయినట్లు తెలిసింది. రియల్టర్ల నంబ ర్లను ట్యాపింగ్ చేసే క్రమంలో వివాదాస్పద భూములను, అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ చేసేవారి వివరాలు సేకరించి, వారి అక్రమాలపై ఎస్ఐబి నిఘా వుంచినట్లు సిట్ సమాచారం సేకరించినట్లు తెలిసింది.

ప్రభాకర్రావు కనుసన్ననలోనే జరిగిందని సిట్కు ఆధారాలు

అనంతరం సదరు వ్యక్తులను తమ కార్యాలయానికి పిలిపించి ఫోన్ ట్యాపింగ్ వివరాలను వినిపించి ఒక వర్గానికి అనుకూలంగా బలవంతంగా సెటిల్మెంట్లు చేయించినట్లు సిట్ గుర్తించినట్లు తెలిసింది. సెటిల్మెంట్లకు అంగీకరించని రియల్టర్లపై ప్రత్యర్థుల చేత కేసులు బనాయించి ఈ కేసుల ఆధారంగా వేధించినట్లు సిట్కు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వందల కోట్ల రూపాయలను అప్పటి ప్రముఖులు వసూలు చేసినట్లు సిట్ గుర్తించినట్లు తెలిసింది. ఇదంతా నాటి ఎస్ఐబి బాస్ ప్రభాకర్రావు కనుసన్ననలోనే జరిగిందని సిట్కు ఆధారాలు లభించినట్లు తెలిసింది. దీనివల్ల అప్పట్లో కొందరు ప్రముఖులు భారీగా లబ్ది పొందారని సిట్కు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఈ గోల్మాల్ వ్యవహారానికి నాటి రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి ఒకరు పూర్తిగా సహకరించారని సిట్ గుర్తించినట్లు తెలిసింది. ఈ దందాలపై అప్పట్లో ఇద్దరు బిఆర్ఎస్ మహిళా నేతలు సర్కారును హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా వెలుగుచూసిన వివరాల ఆధారంగా అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నతాధికారిగా వున్న ఒకరితో పాటు సర్కారును ముందుగానే హెచ్చరించిన ఇద్దరు బిఆర్ఎస్ మహిళా నేతలను విచారించాలని సిట్ నిర్ణయించినట్లు తెలిసింది. సదరు మహిళా నేతలు హెచ్చరించినట్లుగానే సిట్కు భూదందాలకు సంబంధించి డిజిటల్ ఆధారాలు లభించినట్లు సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Land Settlements Hyderabad Phone Tapping Case Telangana Phone Tapping Digital Evidence Rangareddy Land Scam Santosh Rao BRS SIB Prabhakar Rao sit investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.