మూడు సెషన్లలో నిర్వహణ 11 వరకు కొనసాగనున్న పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లోని పిజి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ పిజి ఎంట్రన్స్ (PG Entrance) టెస్ట్ (TGCPGET) -2025 పరీక్షలు సోమవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మూడు సెషన్లలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషన్ పరీక్షలకి సంబంధించిన పాస్వర్డ్ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఓయూ విసి ప్రొఫెసర్ ఎం కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్(సిపిజిఈటి)-2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిష్కరిం చారు. ఈ నెల 11 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. సోమవారం 7 సబ్జెక్టులకి సంబంధించిన పరీక్షలు జరిగాయి. పరీక్షలకి 7643 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 6491 మంది హాజరయ్యారు. పరీక్షలకి దరఖాస్తు చేసుకున్న వారిలో 84.93 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకి హాజరయ్యారని కన్వీనర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని సబ్జెక్టులకి కలిపి దరఖాస్తు గడువు ముగిసేనాటికి సుమారు 58 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 44 సబ్జెక్టులకి సంబంధించి పరీక్షలను నిర్వహించనున్నారు. పిజి కోర్సులైన ఎంఏ, ఎం ఎస్సీ, ఎంకామ్, ఎంఇడి, ఎంపిఈడి వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ప్రో గ్రామ్లతోపాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి సిపిజిఈటీ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఉస్మా నియా విశ్వ విద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జెఎన్జ యుహెచ్)లో ప్రవేశాల కోసం పరిక్షలు నిర్వహించనున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :