తెలంగాణ ప్రభుత్వమే ఇటీవల బీసీ రిజర్వేషన్లను (BC Reservation) 42 శాతానికి పెంచిన నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ పిటిషనర్ గోపాలరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు (Suprem Court) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, ఎందుకు నేరుగా సుప్రీంకోర్టుకి వచ్చారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. పిటిషనర్ అయితే “హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చాం” అని సమాధానం ఇచ్చారు.
Latest News: CM Siddaramaiah: మెట్రో పేరును మారుస్తూ సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం
అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, అదే విషయంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం సబబుకాదని. ఈ నిర్ణయం ద్వారా సుప్రీంకోర్టు ఒకసారి మళ్లీ జ్యూడీషియల్ ప్రాసెస్‌లోని హైరార్కీని గుర్తు చేసింది. మొదట స్థానిక లేదా హైకోర్టుల్లో కేసులు విచారణ పూర్తి అవ్వాలని, తర్వాతే సుప్రీంకోర్టులో అప్పీల్ లేదా ప్రత్యేక అనుమతి కోసం రావాలని న్యాయపరమైన సూత్రం ఉంది. ఈ క్రమంలో, తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపుపై తుది నిర్ణయం హైకోర్టు ఆధీనంలోనే కొనసాగుతుంది.
ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశంపై విచారణ ఎల్లుండి జరగనుంది. ఈ విచారణ ఫలితం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధత పొందుతుందా లేదా అన్నది తేలుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు పట్ల అనుకూల, ప్రతికూల వర్గాల నుండి వచ్చే వాదనలు కూడా హైకోర్టు తీర్పులో కీలకంగా మారవచ్చు. ఈ నిర్ణయం తెలంగాణలోని సామాజిక, రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది.