ఈ మంచు కురిసే చలికాలంలో గోదావరి నది అలలపై ప్రయాణిస్తూ పాపికొండల అందాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం శుభవార్త ప్రకటించింది. భద్రాచలం – పాపికొండలు (Papikondalu) నాన్ ఏసీ ప్యాకేజీ పేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి గల టూరిస్టులు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెలలో, ముఖ్యంగా డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
Read Also: weather: మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ
రోజుల టూర్ షెడ్యూల్ మరియు గమ్యస్థానాలు
డే 1: సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఐఆర్ఓ (IRO)-పర్యాటక్ భవన్ నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుంది. రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ చేరుకుని, రాత్రి మొత్తం భద్రాచలం వైపు ప్రయాణం సాగుతుంది.
డే 2: ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 8:00 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు వెళ్లి, అక్కడి నుంచి లాంచీలో గోదావరిపై పాపికొండల టూర్ మొదలవుతుంది. ఈ జర్నీ పేరంటాలపల్లి, కొల్లూరు, కోర్టూరు ప్రాంతాల మీదుగా సాగుతుంది. ప్రయాణంలో స్నాక్స్, భోజనం ఇస్తారు. సాయంత్రానికి తిరిగి భద్రాచలం చేరుకుని, అక్కడి హరిత హోటల్‌లో రాత్రి బస చేస్తారు.
డే 3: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత భద్రాచలం రాములోరి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. తిరిగి భద్రాచలం హరిత హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ మూడు రోజుల టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధరలు మరియు బుకింగ్ వివరాలు
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ పాపికొండల టూర్ ప్యాకేజీ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- పెద్దలకు: ₹6,999
- పిల్లలకు: ₹5,599
పూర్తి వివరాల కోసం https://tgtdc.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 180042546464 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: