యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద సంక్రాంతి పండుగ ప్రయాణాలు భారీ ట్రాఫిక్‌కు కారణమయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ రికార్డు స్థాయికి చేరింది.
Read Also: BRS Vs Congress : తెలంగాణలో మొదలైన ‘కొత్త’ పంచాయితీ!
టోల్ ప్లాజా(Pantangi Toll Plaza) నుంచి సుమారు కిలోమీటరు నర మేర కార్లు, బస్సులు, లారీలు బారులుగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను త్వరగా క్లియర్ చేయడానికి పోలీసులు, టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ, నిరంతరం పెరుగుతున్న వాహనాల తాకిడితో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
ఈ రద్దీ కారణంగా ప్రయాణ సమయం గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రయాణికులు తెలిపారు. పండుగ సమయంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, టోల్ నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: