పంచాయతీ ఎన్నికల హడావుడిలో ఈసారి నోటా కొత్త ఉత్కంఠను తెచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే కనిపించిన నోటా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఓటర్లలో నోటాపై అవగాహన పెరగడంతో, తాము నచ్చని అభ్యర్థులకు బదులుగా నోటాకు (NOTA) ఓటేయాలనే ప్రవణత గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరుగుతోంది.
Read also: TG: మొదలైన రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
NOTA entry in local body elections
నోటా కీలక ఫ్యాక్టర్‌గా మా
గ్రామాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, చెల్లని ఓట్లతో పాటు నోటాకు పడే ఓట్లు అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య తక్కువ ఉండటం, కొద్దిపాటి ఓట్ల తేడాతో ఫలితాలు మారిపోవడం సాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో నోటా రూపంలో ఉన్న ఈ “కల్పిత అభ్యర్థి” అసలైన పోటీదారుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు.
ఎన్నికల కమిషన్ కేటాయించే గుర్తులు సులభంగా గుర్తుపట్టేలా ఉండాలని అభ్యర్థులు కోరుతున్నా, క్లిష్టమైన గుర్తులు వస్తే ఓటర్లు తప్పుగా నోటాకు ఓటేయవచ్చని భయం ఉంది. గతంలో పలు ఎన్నికల్లో నోటాకు గణనీయమైన ఓట్లు నమోదయ్యాయి. దీంతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నోటా కీలక ఫ్యాక్టర్‌గా మారి, అభ్యర్థుల తలరాతలను నిర్ణయించే స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: