తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు(Panchayat Elections) సంబంధించిన కీలక పిటిషన్‌పై హైకోర్టులో(High Court) ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో విచారణను కోర్టు తర్వాతి తేదీకి మార్చినట్లు సమాచారం. ఈ పిటీషన్‌పై రేపు కోర్టు మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ వ్యవహారాలపై పలు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండటంతో ఈ విచారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
Read Also: TG Elections: జీవో 46 అంటే ఏమిటి? బీసీ రిజర్వేషన్‌పై కొత్త చర్చ!
50% రిజర్వేషన్ పరిమితిలోనే ఎన్నికలకు సిద్ధమని ప్రభుత్వం
కోర్టు ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్ పరిమితిని అతిక్రమించకుండా ఎన్నికల(Panchayat Elections) ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేయనుంది. రిజర్వేషన్లపై గతంలో వచ్చిన న్యాయస్థాన వ్యాఖ్యలు, మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: