Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

Read Time:  1 min
Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి
FONT SIZE
GET APP

Medak Municipal Election: గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి కష్టాలు తెచ్చుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ తప్పిదం చేయకుండా బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం మెదక్ మున్సిపల్ పరిధిలోని 1,2,3,4 వార్డులో అభ్యర్థులు చెప్యాల. రాజవ్వ సంజీవ్,ఎరుకల. ఎల్లయ్య,కొట్టాల.లలితమ్మ విశ్వం, ధర్మశెట్టి. స్వరూపలతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎరువులు సకాలంలో అందజేస్తూ ఇబ్బందులు లేకుండా చూసారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారని చెప్పారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నీరు సరఫరా చేసి మహిళల ఇబ్బందులను తీర్చాలని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆరోపించారు.

Read Also: ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను నేడు ప్రజలు గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేస్తామని అంటున్నారని వెల్లడించారు. ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రూ.2 వేల పింఛన్లు రూ.4 వేలు చేస్తానని ఇవ్వలేదని, ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని, స్కూటీలు రాలేదని, తులం బంగారం ఇవ్వలేదని, మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదని,రూ.5 లక్షల విద్యా గ్యారెంటీ ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి రాలేదని ప్రజలు అంటున్నారని అన్నారు.

Medak Municipal Election
Medak Municipal Election: We will face difficulties if we vote for Congress: Padmadevender Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి, ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు.ఎమ్మెల్యే సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, అనాధలను ఆదుకుంటున్నామని ప్రచారం చేశారని , అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఎవరిని ఆదుకున్నారని ప్రశ్నించారు. కేసులు పెడతామని భయభ్రాంతులకు కూడా చేస్తే ఇక్కడ భయపడే వారు ఎవరు లేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి,మాజీ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,భీమారి. కిషోర్,వార్డ్ ఇంచార్జిలు హవేళిఘనాపూర్ సర్పంచ్ మ్యాకల. సాయిలు,ఉప్ప సర్పంచ్ వడ్ల రాజు,వార్డు ఇంచార్జ్లుసుదర్శన్,రవీందర్, మోహన్ నాయక్,నాగరాజు, రామచంద్ర రెడ్డి శ్రీహరి,పట్టణ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.