📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Outer Ring Train: ఎనిమిది జిల్లాలను కలుపుతూ ఔటర్ రింగ్ రైలు ప్రయాణం

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్, నాంపల్లిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైలు (Outer Ring Train) ప్రాజెక్టు చేపట్టనుండటం ప్రతిపాదనలు సిద్ధం చేసింది సికిందరాబాద్ స్టేషన్ ఆరు మార్గాలతో అనుసంధానం చేయడానికి ఔటర్ రింగ్ రైలు (Outer Ring Train) మార్గానికి మూడు రకాల ఎలైన్మెంట్లతో దక్షి ణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుతో జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి రాకపోకలు మరింత సులభమవుతాయి. ఆయా జిల్లాల్లోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది.

ఎనమిది జిల్లాలకు ప్రయోజనం

ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఎనమిది నుంచి పది జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. 24 నుంచి 36వరకు కొత్తగా రైల్వే స్టేషన్లనూ నిర్మిస్తారు. మొదటి ప్రతిపాదన ప్రకారం 508కిమి నిడివితో 120 మలుపులతో ఈ మార్గం (This road has 120 turns) ఉంటుందని నక్షవేశారు. 16.42కిమి నిడివి టన్నెలు కూడా ఇందులో ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ మార్గం కారణంగా 34 కొత్త స్టేషన్ల నిర్మాణం మార్గంలో చేపడుతారు. మొదటి ప్రతిపాదన గాడిన పెట్టాలంటే 17,763కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రెండో ప్రతిపాదన 511.55 కిమినిడదివతో 152 మలుపులతో ఉంటుంది. ఇందులో 11.15కిమి సొరంగ మారాలు ఉంటాయి కొత్తగా 35 స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రెండో ప్రతిపాదన అమలు చేయాలంటే 15964కోట్ల మూలదదనవ్యం అవుతంది. మూడో ప్రతిపాదన అమలు చేయాలంటే మాత్రం రూ.12070కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మూడో ప్రతిపాదన నిడివి 392.03కి.మీ ఉంటుంది. అందులో 77 మలుపులు, 2.88కిమి సొరంగం, 26కొత్త రైల్వే స్టేషన్లతో ఔటర్రింగ్ రోడ్కనెక్టివిటి జరిగే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రైలు ఎలైన్మెంట్లలో ఆప్షన్1, 3లు 8 జిల్లాల పరిధిలోకి వస్తున్నాయి. ఇందులో మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఆప్షన్ 2లో పై ఎనిమిది జిల్లాలతో పాటు జనగామ, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి.

ఔటర్రింగ్లుతో ఆరు మార్గాలను సికింద్రాబాద్- కాజీపేట, సికింద్రాబాద్-వాడి, సికింద్రాబాద్- డోన్, సికింద్రాబాద్- ముద్దేడ్, సికింద్రాబాద్ కొత్తపల్లి గుంటూరు, సికింద్రాబాద్ – అనుసంధానం చేయడానికి వీలవుతోంది. అనేక రాష్ట్రాల మీదుగా ప్రయాణించే గూడ్స్ రైళ్లను ఎక్కువగా మళ్లించడానికి వీలవుతుంది. వాటిని సికింద్రాబాద్ వరకు రాకుండా మధ్యలోనే రింగ్ రైలు మార్గం ద్వారా ఇతర రూట్లలోకి మళ్లించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించవచ్చు. అంతర్రాష్ట్ర, దూర ప్రాంత వాహనాలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లిపోతున్న మాదిరే, రింగ్ రైలు మార్గంతోనూ అలాంటి ప్రయోజనం ఉంటుంది. బెంగళూరు, చెన్నై, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ముఖ్యమైన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలో రైల్వే టెర్మినళ్లు నిర్మించారు. కానీ రింగ్ రైలు ఎక్కడా లేదు. 2023లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించింది. 2023 సెప్టెంబరులో ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వగా, అది ఇటీవల పూర్తయింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Srinivas Goud: కల్తీకి మేం వ్యతిరేకం.. కల్లు నిషేధిస్తే ఊరుకోం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

#telugu News Breaking News eight districts Hyderabad transport latest news Outer Ring Train Telangana rail project' train connectivity

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.