📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Damodar Rajanarsimha: ఉస్మానియా మెడికల్ కాలేజీకి దేశంలోనే 10 అనుబం ధ హాస్పిటళ్లు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Author Icon By Sharanya
Updated: September 17, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దేశంలోని ఏ మెడికల్ కాలేజీకీ లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒకటి లేదా రెండు హాస్పిటళ్లు మాత్రమే ఉంటాయని, కానీ ఉస్మానియా కాలేజీకి మాత్రం 10 అనుబంధ హాస్పిటళ్లు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ(Osmania Medical College)కి ఉస్మానియా హాస్పిటల్ తోపాటు, నీలోఫర్ హాస్పిటల్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్నో కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ అనుబంధంగా ఉన్నాయన్నారు.

News telugu

ఒక్కో హాస్పిటల్ ఒక్కో స్పెషాలిటీలో లక్షల మందికి వైద్య సేవలు

ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంత పేషెంట్ల ప్రాణాలను ఈ హాస్పిటళ్లే నిలిపాయని మంత్రి గుర్తు చేశారు. 5 వేలకు పైగా బెడ్లతో, ఒక్కో హాస్పిటల్ ఒక్కో స్పెషాలిటీలో లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. వివిధ ప్రత్యేకతలతో ఎంతో ముందు చూపుతో ఏర్పాటైన ఈ హాస్పిటళ్లకు, పూర్వవైభవం తీసుకొద్దామని ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల పనితీరు, ఆయా హాస్పిటళ్లలో అత్యాధునిక వసతుల కల్పన ఇతర అంశాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం సెక్రటేరియట్లోని తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్లూ, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి (MD Phanindra Reddy), ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్ని హాస్పిటళ్ల సూప రింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఆయా హాస్పిటళ్ల పనితీరు, పేషెంట్లకు అందిస్తున్న సేవలు, సాధించిన విజయాలు, సమస్యలపై అధికారులు మంత్రికి వివరించారు. ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న ఒక్కో హాస్పిటల్ కు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని మంత్రి రాజనర్సింహ అన్నారు.

గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు, ఇప్పటి అవసరాలకు అనుగుణంగా హాస్పిటళ్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా చిత్తశుద్ధితో హాస్పిటళ్లను ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలు పనిచేయాలన్నారు. సిద్ధం చేయాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్కు మంత్రి సూచించారు. ఈఎన్టీ హాస్పిటల్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు, ఉస్మానియా డెంటల్ కాలేజీకి సంబంధించిన భూమి సమస్యల పరిష్కారంపై శ్రద్ద పెట్టాలన్ని మంత్రి ఆదేశించారు. అన్ని హాస్పిటళ్లను తానే నేరుగా విజిట్ చేస్తానని, పేషెంట్లకు అందుతున్న సేవలపై నేరుగా వారితోనే మాట్లాడుతానని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mid-day-meal-online-bills-from-october/telangana/549064/

Breaking News Damodar Rajanarsimha Health Infrastructure latest news Medical Education Osmania Medical College Telangana news Telugu News Top Medical Colleges India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.