Organic Farmers App: తెలంగాణ రైతులకు మరో వినూత్న యాప్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్స హించేందుకు త్వరలో కొత్త యాప్ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు రాయితీలు కల్పించడంతోపాటు వారి ఉత్పత్తులకు ఆదాయం పెరిగేలా చేయనున్నారు. అలాగే ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి రైతుల వివరాలన్నీ యాప్లో అందుబాటులో ఉండనున్నాయి.
Read Also:Hyderabad: జోయలుక్కాస్ జ్యుయెలరీలో భారీ చోరీ
ఏ రైతు ఎంత పంట పడిస్తున్నాడు, ఏ పంట పండిస్తున్నాడు, ఎక్కడ సాగు చేస్తున్నాడు, ఉత్పత్తులు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి తదితర వివరాలు కొత్తగా అందుబాటులోకి రానున్న ఆర్గానిక్ ఫామింగ్ యాప్లో ఉండనున్నాయి. రైతుల అడ్రస్, మొబైల్ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. దీంతో యాప్ సహాయంతో ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు నేరుగా రైతులను సంప్రదించవచ్చు. నకిలీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్్కు లేబులింగ్ సిస్టమ్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆర్గానిక్ ఉత్పత్తుల లేబుల్ కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: