Ordnance Factory Medak: 10వ తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం

Read Time:  1 min
Ordnance Factory Medak
Ordnance Factory Medak
FONT SIZE
GET APP

రక్షణ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (Ordnance Factory Medak)లో వివిధ సాంకేతిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంస్థలోని జూనియర్ టెక్నీషియన్,(Ordnance Factory Medak) డిప్లొమా టెక్నీషియన్ స్థానాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై, 21వ తేదీ వరకు కొనసాగుతుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Read Also:  Job Mela: పార్వతీపురంలో ఈ నెల 6న జాబ్ మేళా

Ordnance Factory Medak
Ordnance Factory Medak

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తమ దరఖాస్తులను క్రింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి –
The Deputy General Manager (HR), Ordnance Factory Medak, Yeddumailaram, Sangareddy District, Telangana – 502205.

ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు:

  • డిప్లొమా టెక్నీషియన్ (CNC ఆపరేటర్) – 10
  • జూనియర్ టెక్నీషియన్ (మిల్రైట్) – 05
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఎలక్ట్రిక్) – 05
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) – 03
  • జూనియర్ టెక్నీషియన్ (మిల్లర్) – 01
  • జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్) – 09
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) – 01

అర్హతలు:

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత.
  • సంబంధిత విభాగంలో ఐటీఐ పాస్ అయి ఉండాలి.
  • సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.

వయో పరిమితి:
18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.

మరిన్ని వివరాలకు:
అధికారిక వెబ్‌సైట్‌ ddpdoo.gov.in సందర్శించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.