📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

HYD : హైదరాబాద్లో సొంత ఇల్లు కలను సాకారం చేసుకునే అరుదైన అవకాశం!

Author Icon By Sudheer
Updated: July 23, 2025 • 9:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ల సొంతంటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం (Telagana Govt) న‌డుం బిగించింది. హైదరాబాద్ మ‌హా నగర పరిధిలో సౌకర్యవంతమైన ధరలతో, క్లియర్ టైటిల్స్, పారదర్శక విధానం, అందుబాటు ఉన్న ప్రదేశాల్లో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సొంతిల్లు కొనాలి, కట్టుకోవాలి అనుకునే మధ్యతరగతి కుటుంబాల కోసం రాజీవ్ స్వ‌గృహ ఆధ్వ‌ర్యంలో ఫ్లాట్లు, ప్లాట్ల‌ను ప్ర‌భుత్వం వేలం వేస్తోంది. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నివాసానికి సిద్ధంగా ఫ్లాట్లు. బండ్లగూడ (నాగోల్ వైపు), పోచారం (ఇన్ఫోసిస్ SEZ దగ్గర) వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో 1 BHK ఫ్లాట్లు – Rs.13 నుండి Rs.15 లక్షల మధ్య ఉండ‌గా,
2 BHK ఫ్లాట్లు – Rs.19 నుండి Rs.25 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి.


ఈ ఫ్లాట్లకు ఉన్న ప్రత్యేకతలు:


● నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లకు దగ్గర
● ఇటీవలి IT కంపెనీలు, SEZలకు సన్నిహితంగా
● యశోద, కామినేని వంటి ప్రముఖ ఆసుపత్రులు సమీపంలో
● ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు పరిసర ప్రాంతాల్లో


గేటెడ్ కమ్యూనిటీలు, క్లియర్ డాక్యుమెంట్లు..


పూర్తిగా రెడీగా ఉన్న ఈ ఫ్లాట్లు కుటుంబ జీవనానికి అనుకూలంగా ఉండేలా అధునాతన సౌకర్యాలతో రూపొందించబడ్డాయి.
సీనియర్ సిటిజన్ల కోసం 1 BHK ఫ్లాట్లు వారికి ప్రత్యేకంగా కేటాయించబడతాయి. ఈ కేటాయింపు పారదర్శక లాటరీ విధానం ద్వారా జరుగుతుంది.
కుర్మల్ గూడ, బహదూర్పల్లి, తొర్రూర్ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు…
200 గజాల పైగా ప్లాట్లు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాలు:
● ORR మరియు ప్రధాన రహదారులకు సన్నిహితంగా
● విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య కేంద్రాలకు దగ్గరగా
● పారదర్శక వేలం విధానం ద్వారా కేటాయించబడతాయి
● క్లియర్ టైటిల్స్, రిజిస్ట్రేషన్కు సిద్ధంగా ఉన్న ప్లాట్లు

వేలం తేదీలు – సమయాలు:
ఫ్లాట్ల దరఖాస్తు గడువు తేదీలు:
● బండ్లగూడ: జూలై 29 | లాటరీ: జూలై 30
● పోచారం: జూలై 31 | లాటరీ: ఆగస్టు 1

ప్లాట్ల EMD చెల్లింపు తేదీలు:
● ఆగస్టు 2 నుండి 19 వరకు

వేలం తేదీలు:
● ఆగస్టు 4, 5, 6, మరియు 20

సంప్రదించాల్సిన నంబర్లు:
ఫ్లాట్లు:
● బండ్లగూడ: 7702977006

● పోచారం: 9959989482

ప్లాట్లు:
● కుర్మల్ గూడ: 8121022230

● బహదూర్పల్లి: 7999455802

● తొర్రూర్: 8688468930

దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి వివరాలకు, అర్హత తనిఖీ చేసుకోవడానికి, ప్లాన్లు, మ్యాప్లు చూడటానికి అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించండి www.swagruha.telangana.gov.in

Read Also : BC Rreservation : బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలన్న రేవంత్ రెడ్డి డిమాండ్

hyderabad rajiv swagruha flats allotment list Telangana Govt Telangana Swagruha Telangana Swagruha flats sale

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.