కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాయని, ఈ అన్యాయాన్ని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీలకు ఢిల్లీ ప్రయోజనాలే ముఖ్యమని, కానీ బీఆర్ఎస్‌కు మాత్రమే తెలంగాణ ప్రయోజనాలు సుప్రీం అని ఆయన పునరుద్ఘాటించారు.
Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన
రానున్న అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరిని సభలో ఎండగట్టాలని సూచించారు. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని, అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు అర్థమయ్యేలా వివరిద్దాం” అని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. సభలో కేవలం విమర్శలు చేయడం కాకుండా, తగిన ఆధారాలతో, గణాంకాలతో పాలకులను ఇరుకున పెట్టాలని, ప్రజల పక్షాన గొంతు వినిపించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. ఇందులో భాగంగా మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు. ఈ మూడు జిల్లాల సభలకు సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలను పార్టీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అసెంబ్లీలో పోరాటం, బయట బహిరంగ సభలతో కాంగ్రెస్ సర్కార్‌పై ఉధృత స్థాయిలో ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com