📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Online : ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ – సులభంగా నిర్మాణ పురోగతి తెలుసుకునే అవకాశం

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Online) : ఇందిరమ్మ ఇండ్ల (Indiramma’s house) పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఇకపై ఇళ్ల నిర్మాణం ఏస్థాయిలో ఉంది, బిల్లుల చెల్లింపు తదితర వివరాలు ఈజీగా ట్రాక్ చేయవచ్చా. వివరాలు పూర్తిగా ఆన్లైన్లో అందు బాటులో ఉంటాయి. పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు వెబ్ సైట్ లో అధికారులు మార్పులు చేశారు. లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ వివరాలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో సులభంగా చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు శుభవార్త, ఇకపై ఇంటి నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు వంటి సమగ్ర వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వం పారదర్శం తను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్లో మార్పులు చేసి, లబ్ధిదారుల సమాచారాన్ని నేరుగా చూసుకునే వీలు కల్పించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ సౌకర్యం వల్ల లబ్దిదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, కార్యాలయాల చుట్టూ తిరిగేందు సమయం, డబ్బులు వృథా అవుతుండగా.. సమస్యకు చెక్ పెట్టేందుకు వెబ్సైట్లో మార్పులు చేశారు. ప్రజల సౌకర్యార్థం ఈ వెబ్సైట్లో సమాచారం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంచారు. దీనివల్ల భాషాపరమైన సమస్యలు లేకుండా ప్రజలు సులభంగా తమ వివరాలను తెలుసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇళ్లను ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేయగా.. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్క్ అవుట్, పునాదులు, గోడలు, స్లాబ్ వంటి నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగానే లబ్దిదారులకు నాలుగు విడతలుగా రూ.5 లక్షల ఆర్థిక సాయం విడుదల చేస్తున్నారు. తమ ఇంటి నిర్మాణ బిల్లు ఏ స్థాయిలో ఉంది? ఏ అధికారి వద్ద ఆగిపోయింది? వంటి వివరాల కోసం లబ్దిదారులు గతంలో హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమాచారం అంతా ఆన్లైన్లోనే లభిస్తుంది. బిల్లు ఏ కారణంతో ఆగి పోయిందో కూడా తెలుసుకునే వీలు ఉండటంతో, లబ్దిదా రులు ఆ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

లబ్దిదారులు తమ వివరాలు తెలుసుకు నేందుకు ఇందిరమ్మ ఇల్లు అనే వెబ్సైట్లో ఆప్లికేషన్ బటన్పై సెర్చ్ చేయాలి. అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇందిరమ్మ ఇల్లు అనే వెబ్సైట్లో అప్లికేషన్ సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్ బై ఆప్షన్లో ఆధార్ లేదా మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఎంచుకోవాలి. వివరాలు నమోదు చేయగానే, స్క్రీన్పై లబ్దిదారుని పూర్తి సమా చారం, ఇంటి నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు తేదీలు, చెల్లించిన మొత్తం వంటి వివరాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, లబ్దిదారుల సమాచారంలో ఏదైనా లోపాలు ఉంటే, అవి కూడా వెబ్సైట్లో కనిపిస్తాయి. లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీసి గౌతమ్ సూచించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/health-the-center-is-the-mainstay-for-the-health-of-the-people-minister-kishan-reddy/telangana/528938/

Google news housing project updates Housing Scheme Indiramma housing Latest News in Telugu online monitoring Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.