చార్మినార్ (హైదరాబాద్): హైదరాబాద్ పాతబస్తీలో నూతనంగా నిర్మించిన ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, శాలిబండ పోలీస్ స్టేషన్ల (Police stations) నూతన కొత్త భవనాలతో పాటు ఆధునీకరించిన పురానీ హవేలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని (Police Commissioner’s Office) రాష్ట్ర రవాణా, బి.సి. సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ది కొత్వాల్ హౌస్ పురానీ హవేలి భవనాన్ని తిరిగి వాడుకలోకి తీసుకువచ్చి దానికి పూర్వ వైభవం తీసుకు రావటానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు.
పోలీస్ స్టేషన్ ల ఆధునీకరణ
నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ (Police stations) పరిధిలో మరిన్ని సిసి కెమెరాలు పెంచటానికి నిధులు ఇస్తామని ఆయన తెలియజేశారు. కార్యాలయం పురానీహవేలిలో ఉండేదని, దీనిని ది కొత్వాల్ హౌస్ (Kotwal House) అనే పిలిచే వారని 1920 నుంచి 2002 వరకు పోలీస్ ప్రధాన కార్యాలయంగా పని చేసిందని తెలిపారు. నాలుగు సంవత్సరాలు క్రితం భవనం పై కప్పు కూలటంతో పడగొట్టాలని అనుకున్నారని ఆయన తెలియజేశారు. పునరుద్దణ కోసం ఏసి అర్బన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్కో గ్రూప్ వారు మందుకు వచ్చి భవనం పునరుద్ధణకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పారని, 2022 డిసెంబరులో పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని, చారిత్ర క కట్టడాన్ని తిరిగి కాపాడినందుకు అందరికి ఆయన అభినందనలు తెలిపారు.
కాగా కాలాఫత్తర్ పోలీస్ స్టేషన్ నూతన భవాన్ని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభంచారు. ఈ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాద వ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ అఫెంధీ, చార్మినార్, బహదూర్పుర ఎమ్మెల్యేలు మీర్ జుల్ఫికర్ అలీ, మహ్మద్ ముబీన్, అడిషనల్ సిపి క్రైమ్ విశ్వ ప్రసాద్, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, సౌత్ జోన్ డిసిపి స్నేహా మెహ్రా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ ఎఆర్.శ్రీనివాస్,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఎం. రమేష్ రెడ్డి, డిసిపి ఎస్బి అపూర్వరావు, సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ డిసిపి రక్షిత కృష్ణ మూర్తి, ట్రాఫిక్ డిసిపి వెంకటే శ్వర్లు, సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్య కుమార్తో పాటు పాతబస్తీలోని ఏసిపిలు.సిఐలు పాల్గొన్నారు .
హైదరాబాద్ ఓల్డ్ సిటీ కింద ఏది వస్తుంది?
పాత నగరం మధ్యలో చార్మినార్ ఉంది, మరియు ఈ ప్రాంతంలో షా అలీ బండా, యాకుత్‌పురా, డబీర్‌పురా, అఫ్జల్ గంజ్, మొఘల్‌పురా, మలక్‌పేట మరియు అంబర్‌పేట వంటి నగరంలోని ప్రధాన పొరుగు ప్రాంతాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Konda Surekha: ఏపీలో 7 మండలాల విలీనం వల్లే భద్రాచలం భూముల వివాదం-మంత్రి కొండా సురేఖ