📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Old City – మ్యాన్ హోల్ పడ్డ చిన్నారి..ఆపై ఏమైంది..

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ్యాన్ హోల్ (Man hole) ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు ప్రవహిస్తూ, మ్యాన్ హోల్ మూతలు తెరచుకుంటాయి. ఇలాంటప్పుడు అక్కడ మ్యాన్ హోల్ ఉందనే విషయం తెలియక కాలుపెడితే ఇక ప్రాణాలు పోవడమే. ఇలాంటి
ప్రమాదాలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. సరే వర్షాలు వచ్చినప్పుడు అంటే రోడ్లపై వచ్చే వరదనీటికీ అవి కనిపించవు,

మరి మరమ్మతుల (Repairs) పేరుతో మ్యాన్ హోల్ ను తెరచినప్పుడు వాటిపై మూతపెట్టకుండా అలాగే వదిలేస్తే ఈ తప్పు ఎవరిదని చెప్పాలి. మూతలేని ఓ మ్యాన్ హోల్ తెరచి ఉంచి, దానిపై ఎలాంటి హెచ్చరికలు లేకపోతే ప్రమాదం చోటుచేసుకుంటే ఎవరిని నిందించాలి? ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఓ చిన్నారి తెరచి ఉన్న మ్యాన్ హోల్ లో పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..

ఓపెన్ డ్రెయిన్ లో పడ్డ చిన్నారి

యాకుతురాలోని పాతబస్తీ (Old City) లో ఓపెన్ డ్రెయిన్లో ఓ చిన్నారి పడిపోయింది. అదృష్టవశాత్తు అప్రమత్తం అయిన తల్లి తన బిడ్డను బయటకు తీసి, కాపాడుకుంది. పూడికతీత పనులు చేపట్టి పనిపూర్తి చేసుకున్న సిబ్బంది ఓపెన్ డ్రెయన్ (Drain) మూత పెట్టకుండా వెళ్లిపోయారు. ఇద్దరు చిన్నారులను స్కూలు నుంచి తీసుకొస్తున్న ఓ మహిళ ఒక పాప చేయి పట్టుకుని నడుస్తుండగా మరో పాప ముందు నడుస్తున్నది. ఆ చిన్నారి తన ముందు ఉన్నఓపెన్ డ్రెయిన్ను చూసుకోలేదు.

దీంతో ఆ బాలిక అందులో పడిపోయింది. వెనుకే వస్తున్న తల్లి వెంటనే అప్రమత్తమై తన చిన్నారిని గుంతలో నుండి వెలికి తీసింది. ఇంతలో ఇద్దరు మగవారు అక్కడికి చేరుకుని, అందుల్లో ఉన్న హెచ్చరిక జెండాను సరిగ్గా నిలబెట్టి వెళ్లారు. ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డయింది. ఈ వీడియో వైరల్ గా మారింది. మ్యాన్ హోల్ మూత తీసింది మేం కాదని జలమండలి సిబ్బందే అంటూ ఒకరిపై ఒకరు నిందించుకోవడం కొసమెరుపు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/suravaram-sudhakar-reddy-memorial-meeting/andhra-pradesh/545898/

Breaking News child falls incomplete work latest news mother saves Municipal workers negligence old city open drain Public Safety school children Telugu News Yakutpura

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.