10 శాతం మేర తగ్గిన ఆయిల్పామ్ ధరలు రేట్లు
హైదరాబాద్ : కేంద్రం ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలను తగ్గించడంతో దాని ప్రభావం తెలంగాణ రైతులపై తీవ్రంగా చూపుతోంది. దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఆయిల్ పామ్ గెలల (Oil palm plantation) ధరలు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, దీనివల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ గెలల (Oil palm plantation) ధరలు 10 తగ్గాయి. దీనికి తగినట్లుగా ఆయిల్ పామ్క కనీస మద్దతు ధరలు లేకపోవడంతో పాటు, పెరుగు తున్న ఖర్చులు, నాసిరకం మొక్కలు మరియు లాజిస్టికల్ సమస్యలు ఉన్నందున నష్టాలతో సాగును వదిలివేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడి పామాయిల్, ఇతర వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, తెలంగాణలోని ఆయిల్ పామ్ రైతులు తాజా పండ్ల గుత్తుల (ఎఫ్ఎఫ్బి) ధరలు బాగా తగ్గడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం మే 31 నుండి అమలులోకి వచ్చిన సుంకం తగ్గింపుతో ధరలలో దాదాపు 10 తగ్గుదలకు దారితీసింది. మరోపక్క రాష్ట్రంలో కనీస మద్దతు ధర లేకపోవడం కూడా ఒక క్లిష్టమైన సమస్యగా రైతులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ అస్థిరతలను తట్టుకోవడానికి రైతులు కనీస మద్దతు ధరగా టన్నుకు రూ.25,000 డిమాండ్ చేస్తున్నారు.
సాగు ఖర్చుల పెరుగుదలతో రైతులపై భారం
ప్రధానంగా సాగు ఖర్చులు భారీగా పెరగడంతో ఇప్పటికే రైతులపై భారం పెరిగింది. కూలీ ధరలు రోజుకు రూ.300 నుండి రూ.800 నుండి రూ.1,000 వరకు పెరగ్గా, ఎరువులు, పురుగుమందుల ధరలు 120 శాతం వరకు పెరిగాయి. మరోపక్క కంపెనీలు సరఫరా చేస్తున్న
నర్సరీల్లో 10 నుండి 50 శాతం నాణ్యత లేనివిగా ఉండటంతో నాలుగు సంవత్సరాల కాలం తర్వాత చాలా తోటలు విఫలమవుతాయి, దీనివల్ల రైతులు వాటిని తొలగించి మరోసారి తిరిగి నాటవలసి వస్తుంది, ఫలితంగా భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. S దిగుమతి సుంకం పెంచడంతో ఆయిల్ పామ్ రైతులు నష్టాల పాలవుతారని, ఈ నిర్ణయానిన పునసమీక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Tummala Nageswara Rao) కేంద్రానికి లేఖలు కూడా రాశారు. అయినా దిగుమతి సుంకంపై తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించ లేదు. దీంతో తెలంగాణలో ఆయిల్ పామ్ రైతుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది.
Read also: Black Spot: బ్లాక్ స్పాట్ పై ప్రజలను అప్రమత్తం చేయండి