oil palm farming : ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం లభిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు, ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి ఆయన సిద్దిపేటలో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం ఇచ్చే పంటల్లో ఆయిల్ ఫామ్ ముందంజలో ఉందన్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఈ సాగులో ఉందని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ వైపు దృష్టి సారిస్తే ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
కేసీఆర్ గారి ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా నర్మేట ప్రాంతంలో (oil palm farming) ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిదశకు చేరుకుందని హరీష్ రావు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం అయితే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: