Oil Palm Factory Inauguration: పండుగ వాతావరణంలో ఫ్యాక్టరీ ప్రారంభించుకోవడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం నాడు మండల పరిధిలోని నర్మెట గ్రామంలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణం లో ప్రారంభించుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి దగ్గర టైం తీసుకుని ఏ తేదీన ప్రారంభించుకోవడం జరుగుతుందో కలెక్టర్ కు తెలియజేస్తామన్నారు.
Read Also : Maoist leader Devji: లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

మూడు రోజుల పాటు రైతులకు మేళా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రైతులను ఆహ్వానించి 20,21,22,తేదీల్లో ఫ్యాక్టరీ ఆవరణలో స్టాళ్లను ఏర్పాటు చేసి మూడు రోజులపాటు రైతులకు అవసరమయ్యే పనిముట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. రైతులు వరి పంటలు పెట్టడం తగ్గించి ఆయిల్ ఫామ్ తోటలను పెట్టుకున్నట్లైతే రైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. ఏప్రిల్ నుండి క్రాప్ ఎక్కువగా వస్తుంది కావున త్వరగా ఫ్యాక్టరీని ప్రారంభించుకొని పామాయిల్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల రైతులందరికీ అందుబాటులో నర్మెట ఫ్యాక్టరీ ఉంటుందన్నారు ఫ్యాక్టరీ ప్రారంభించుకోవడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
అలాగే ఫ్యాక్టరీలోనే రిఫైండ్ ఆయిల్ కోసం 40 కోట్లతో నిర్మించబోయే ఆయిల్ రిఫండర్ కు ఫ్యాక్టరీ కీ కూడా ప్రారంభం రోజే శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎక్కువగా ఇరిగేషన్ ఆర్టికల్చర్ వ్యవసాయం వైపు మొగ్గుచూపాలన్నారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి దాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెప్తుందన్నారు కావున రైతులందరూ పామాయిల్ తోటలను పెట్టుకుంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధిక ఆదాయం వస్తుందన్నారు పామాయిల్ తోటలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు మందులను పెట్టుబడిని ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆయిల్ ఫామ్ తో రైతులకు అధిక ఆదాయం
ఫ్యాక్టరీ నుండి వేస్టేజ్ పిప్పి తో ఫ్యాక్టరీకి సరిపడా విద్యుత్తును కూడా తయారు చేసుకోవడం జరుగుతుందన్నారు పామాయిల్ రైతులకు ఎకరా కు 16 టన్నుల దిగుబడి వస్తుంది అన్నారు ఆయిల్ ఫామ్ తోటలతో రైతులకు అధిక ఆదాయంతో పాటు ఎలాంటి చీడపీడల బాధ లేకుండా ఉంటారన్నారు పామాయిల్ ఫ్యాక్టరీలో రైతులు గింజలు అమ్మిన మూడు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయన్నారు రైతులకు గ్యారెంటీగా డబ్బులు వస్తాయనే నమ్మకం ఉన్న పంట పామాయిల్ పంట అన్నారు ఇతర దేశాల్లో వర్షాలతోనే ఈ పంటలు ఎక్కువగా పండుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి ఆయిల్ ఫామ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి వివిధ శాఖల అధికారులు ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :