ఢిల్లీలో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో (Republic Day 2026) రాష్ట్ర కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక జీవనంలో భాగమైన ఒగ్గుడోలు ప్రదర్శనకు రిపబ్లిక్ డే పరేడ్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి. ఇందుకోసం సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వికారాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుంచి 30 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లి 8వ తేదీ నుంచి రిహార్సల్స్ చేయనున్నారు.
Read also: DelhiBlast Case: ఘోస్ట్ సిమ్స్‌తో ఉగ్రకుట్ర గుట్టు విప్పిన NIA

‘ఒగ్గు కథ’
ఒగ్గుడోలు జానపద కళారూపం మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక జీవనంలో భాగం. ప్రధానంగా కురుమ, గొల్ల కులస్తులు తమ ఆరాధ్య దైవాలైన మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మల కథలను గానం చేస్తూ.. డోలు వాయిస్తూ చేసే ప్రదర్శనే ఒగ్గుడోలు. ఒగ్గు అంటే శివుడి చేతిలోని ‘డమరుకం’ అని అర్థం. ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తూ కథలు చెప్పడం వల్ల దీనికి ‘ఒగ్గు కథ’ అని పేరొచ్చింది. కళాకారులు తరతరాలుగా వస్తున్న ఈ కళను బతికించుకుంటూ నేటి తరానికి అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటిన ఒగ్గు కళాకారులు.. ఇప్పుడు కర్తవ్యపర్లో ప్రదర్శన చేయనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: