📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

NTR District: ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

Author Icon By Saritha
Updated: February 7, 2026 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా (NTR District) కంచికచర్ల మండలం కీసర వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైనప్పటికీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సంభవించిన వెంటనే ప్రయాణికులను బయటకు దింపడంతో అందరూ సురక్షితంగా బయటపడగా, పెద్ద ప్రమాదం తప్పినందుకు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Read Also: Vizianagaram Library: గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి దించిన వైనం

బస్సులో ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. వెనుక నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపివేసి ప్రయాణికులను క్షణాల్లో బయటకు దించాడు. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. 

డ్రైవర్ తీసుకున్న సత్వర నిర్ణయంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు అగ్నిప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై (NTR District) ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ లేదా వైర్లలో సాంకేతిక లోపం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad–Vijayawada National Highway Kanchikacherla Mandal Keesara Latest News in Telugu ntr district private travels bus fire accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.