📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

NRI Death: అమెరికాలో తెలంగాణ వ్యక్తి గుండెపోటుతో మృతి

Author Icon By Saritha
Updated: January 28, 2026 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో తెలంగాణకు (TG) చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (NRI Death) అకాల మరణం చెందారు. వనపర్తి జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన ఫ్లోరిడాలో నివాసముంటూ ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలో వర్క్‌ ఫ్రం హోం చేస్తుండగా ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Read Also: TG Politics: స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లపై రాజకీయ మౌనం

కుటుంబంతో పదేళ్లుగా అమెరికాలోనే

హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం బొల్లారం గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థితిలో ఉన్న కుమారుడు ఇలా అకస్మాత్తుగా మరణించాడనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. (NRI Death) హర్షవర్ధన్‌రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్న ఆయన తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం స్నేహితులను, బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్పంచ్ కుమారుడు, గ్రామానికి చెందిన విద్యావంతుడు కావడంతో బొల్లారంలో నిశ్శబ్దం ఆవరించింది. హర్షవర్ధన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అమెరికాలోని తెలుగు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధుల సహాయాన్ని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Florida Harshavardhan Reddy heart attack Indian American Latest News in Telugu NRI Death Telangana man Telugu News USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.