📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Dasara : దసరా రోజున ముక్క లేనట్లేనా..?

Author Icon By Sudheer
Updated: October 1, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ లో దసరా (Dasara ) పండగను ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలియంది కాదు..మద్యం , మాంసం లతో ప్రతి ఇంట్లో విందు వినోదాలతో ఉంటాయి. కానీ ఈసారి ఆ రెండు లేనట్లే అని అంత బాధపడుతున్నారు. దీనికి కారణం దసరా రోజే గాంధీ జయంతి రావడం.

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి(Gandhi Jayanti)ని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆచరించిన అహింసా, శాంతి సిద్ధాంతాలను గౌరవిస్తూ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) నగరంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలో కూడా ఇదే తరహా ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కూడా అక్టోబర్ 2న మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ప్రకటన విడుదల చేసింది. రెండు నగరాల్లోనూ ఈ ఆంక్షలు అమలు చేయడం ద్వారా గాంధీ జయంతి రోజున అహింసా స్ఫూర్తిని నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రత్యేకంగా పరిశుభ్రత, శాంతి వాతావరణం కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

అయితే అదే రోజున దసరా పండుగ కూడా ఉండడంతో మాంసం ప్రియులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భంలో సాధారణంగా మాంసం వంటకాలు ఎక్కువగా వండుకునే కుటుంబాలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. కొందరు మున్సిపల్ ఆదేశాలను గౌరవిస్తూ పండుగ రోజు శాకాహారానికి మొగ్గుచూపుతామని చెబుతుండగా, మరికొందరు ముందురోజే మాంసం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. మొత్తంగా గాంధీ జయంతి పవిత్రతను కాపాడుతూ, పండుగ ఉత్సాహాన్ని కూడా కొనసాగించేలా ప్రజలు తగిన సర్దుబాట్లు చేసుకుంటున్నారు.

Tekugu News: Labor Statistics: ఏఐతో కొత్త చిక్కులు.. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో?

dasara Google News in Telugu Latest News in Telugu NoN veg

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.