హాల్ టిక్కెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్ హాల్ టిక్కెట్ల జారీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో హాల్ టిక్కెట్ లేకపోయినప్పటికీ పరీక్షలకు అనుమతించాలని నిర్ణయించింది. ఫీజు చెల్లించిన, చెల్లించని వారి జాబితాను సిద్ధం చేయాలని తెలిపింది. అలాగే హాల్ టిక్కెట్ రాని వారి జాబితాను సిద్ధం చేయాలని సిబ్బందిని బోర్డు ఆదేశించింది. ఈరోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
హాల్ టిక్కెట్ లేకున్నా పరీక్షలకు అనుమతించాలి: తెలంగాణ ఇంటర్ బోర్డు
By
Vanipushpa
Updated: January 30, 2025 • 3:21 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.