గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తన పార్టీపై స్పష్టత ఇచ్చారు. బీజేపీనే తన ఇల్లు అని, ఆ పార్టీకి ఎప్పుడూ నిబద్ధుడిగా ఉంటానని తెలిపారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.తనకు ఇతర ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని రాజాసింగ్ చెప్పారు (Raja Singh said he did not receive an invitation from any party) . కేంద్ర నాయకులు పిలిస్తే ఎప్పుడైనా బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఎవరూ తనను బయటకు పంపలేదని, తానే వెళ్లానని తెలిపారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కార్యకర్తలు ఆశించారని అన్నారు. కానీ కొన్ని తప్పుల వల్ల పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. తాను సహా కొందరు నాయకుల తప్పులు కూడా కారణమై ఉండవచ్చని అంగీకరించారు. ఈ విషయాలను ఢిల్లీ పెద్దలకు చెప్పడానికే రాజీనామా చేశానని చెప్పారు.
కేంద్ర నాయకులతో చర్చకు సిద్ధం
త్వరలోనే కేంద్ర పెద్దలు పిలుస్తారని, వారిని కలసి తన రాజీనామా కారణం వివరిస్తానని అన్నారు. బీజేపీ తన ఇల్లు కాబట్టి తిరిగి చేరడంలో ఎలాంటి సందేహం లేదని మరోసారి స్పష్టం చేశారు.హరీశ్ రావు తనను బీఆర్ఎస్‌లో ఆహ్వానించారన్న వార్తలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ నుంచి ఎవరూ సంప్రదింపులు జరపలేదని చెప్పారు. వ్యక్తిగతంగా హరీశ్ రావు, కేటీఆర్‌లతో సంబంధాలు ఉన్నప్పటికీ ఆహ్వానం రాలేదని తెలిపారు.
శివసేన, జనసేనపై వచ్చిన వార్తలపై స్పందన
శివసేన బాధ్యతలు తీసుకుంటున్నానన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. శివసేన, జనసేన, టీడీపీ అన్ని బీజేపీతో ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి ఆ పార్టీల్లో చేరతానన్న ప్రచారం నిరాధారమని అన్నారు.“రాజీనామా చేసిన రోజే చెప్పాను. బీజేపీలో ఉన్నా లేకపోయినా, ప్రధాని మోదీకి సైనికుడిగా ఉంటాను” అని రాజాసింగ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, జేపీ నడ్డా చేస్తున్న మంచి పనులకు ప్రచారం చేయడంలో ముందుంటానని చెప్పారు.
ఇతర పార్టీలపై విమర్శలు
తాను హిందూత్వాన్ని నమ్ముతానని, అందుకే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌కు తన అవసరం లేదని అన్నారు. వారికి కావల్సింది మజ్లిస్‌తో కలిసే రాజకీయమని విమర్శించారు.రాజాసింగ్ స్పష్టంగా చెప్పినది ఒక్కటే – బీజేపీ ఆయనకు ఇల్లు. పిలిస్తే ఎప్పుడైనా తిరిగి వెళ్ళడానికి సిద్ధమని మరోసారి ప్రకటించారు.
Read Also : Kaushik Reddy: 14 మంది ప్రైవేటు గన్‌మన్‌ల తో కౌశిక్ రెడ్డికి భద్రత