📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Nizamabad: త్వరలో నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించనున్న అమిత్ షా

Author Icon By Ramya
Updated: June 27, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిజామాబాద్ లో ప్రధాన కార్యాలయం ప్రారంభించనున్న అమిత్ షా

Hyderabad: దేశవ్యాప్తంగా పసుపు బోర్డు కార్యకలాపాలకు నిజామాబాద్ (Nizamabad) లో నేషనల్ హెడ్క్వర్టర్ను ఏర్పాటు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం గొప్ప విషయం అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యాలయా.న్ని ఈనెల 29వ తేదిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రారంభించనున్నారని కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. గురువారం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు రాజకీయ పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు కాలేదన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ప్రకటించారని తెలిపారు.

నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు గౌరవంగా ఏర్పాటు

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రాల్లోని నేషనల్ హెడ్క్వార్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనప్పటికీ నిజామాచారికి మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కు చెందిన రైతుని నియమించడం అభినందనీయం అన్నారు. జూన్ 29న హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంబించి, బోర్డు లోగోను ఆవిష్కరిస్తారని వివరించారు. అనంతరం రైతు సభలో ప్రసంగిస్తారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాలుగా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువుగా నిలిచిందని, ఇది రైతు చైతన్యానికి ప్రతీకగా మారిందన్నారు. గ్రామగ్రామాన రాజకీయాలకు అతీతంగా రైతులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యలపై పోరాడుతున్నారని, స్థానిక నాయకులు, ఎంపిల కోరిక మేరకు కేంద్రం జాతీయ పసువు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత రైతులకు గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్చందంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. హిందూ సమాజంలో పసుపు పవిత్రతకు ప్రతీకగా నిలిచిందని, వేదకాలం నుంచే శుభకార్యాలలోను శాస్త్రీయ పద్ధతుల్లోను, ఆరోగ్య సంబంధిత అనేక అంశాలలోను పసుపు వినియోగంలో ఉందన్నారు.

పసుపు బోర్డుతో రైతులకు మేలు, ఉపాధికి దోహదం: అమిత్ షా

పసుపు పండించే రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ప్రకటించిన ఉద్దేశ్యం అన్నారు. ఈ బోర్డు ద్వారా ప్రతి రైతుకు ప్రయోజనం కలగాలన్న దృష్టితో, రైతులంతా సమన్వయపూరితంగా కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. బోర్డు ప్రారంభం అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారని తెలిపారు. పనుపు ధరలు పెరిగేలా. వ్యాల్యూయారెడ్ ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతు గౌరవం పెరగాలన్నదే ఉద్దేశ్యమని, నిజామాబాద్ జిల్లాలో పనుపు బోర్డు ఏర్పాటుచేయడం ప్రధాని మోడీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి లభించిన ఒక అద్భుత బహుమతి అన్నారు. డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వారి జీవితంలో చివరి దశలో బిజెపికి దగ్గరయ్యారు. మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి జూన్ 29 న జరగనుందన్నారు. ఈ సందర్భంగా ఎంపి అర్వింద్ ధర్మపురి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అభ్యర్థించడంతో పెద్ద మనసుతో అంగీకరించారు. జూన్ 29న రైతు సభకు వెళ్లే క్రమంలో డి. శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Read also: Raghunandan: బిజెపి నేత రఘునందన్ కు భద్రత హెచ్చింపు

#AgricultureReforms #AgriPolicy #amitshah #BJPInitiative #DSrinivas #EmploymentOpportunities #FarmerUnity #FarmerWelfare #IndianFarmers #IndianSpices #KishanReddy #ModiGovernment #NationalTurmericBoard #Nizamabad #NizamabadPride #PiyushGoyal #RuralDevelopment #TelanganaDevelopment #TurmericBoard #TurmericEconomy #TurmericExport #TurmericFarmers #TurmericPrice #ValueAddedProducts Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.