Nizamabad: పోటీ ద్వారా రైతులకు మెరుగైన ధర కల్పించడం, బిడ్డింగ్ లో పారదర్శకత కోసం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) వ్యవస్థ ప్రహసనంగా మారుతోంది. తరచూ సాంకేతిక సమస్యలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ నెలా 10 నుండి 15 రోజులపాటు ఇ-నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్లలో వంటల క్రయవియాలు తరచూ నిలిచిపోతున్నాయి. దీంతో ఇ-నామ్ పోర్టల్తో పోటీ పెరిగి తమ పంటలకు అధిక ధరలు రావడం అటుంచితే కనీసం గిట్టుబాటు ధరకు కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంటోంది.
Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు
ఇ-నామ్ విధానంలో దేశంలోని ఎక్కడి వ్యాపాదులైనా, ఎక్కడి వంటనైనా ధరలు ప్రతిపాదించి కొనుగోలు చేయొచ్చు. దీనివల్ల రైతుకు అత్యధిక ధరలు దక్కే అవకాశం ఉంది. దాదాపు 8 ఏళ్ల కిందట ఇ-నామ్ పోర్టల్ ప్రారంభం కాగా అప్పటి నుంచీ వ్యాపారులు ఆన్లైన్లోనే బిడ్డింగ్ దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం సేవలు నిలిచిపోవటంతో మార్కెయార్డుల్లో అధికారులు పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక వ్యాపారులు కోట్ చేసిన ధరలే ఖరారవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని 57 ప్రధాన వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులు నష్టాలకే తమ పంటను వ్యాపారులు ఖరారు చేసిన ధరలకు విక్రయించాల్సి వస్తోంది.
అధికారులను సంప్రదిస్తే
అధికారులను సంప్రదిస్తే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)లో సాంకేతిక సమస్యల వల్ల ఇ-నామ్ సేవలు నిలిచాయని, రోజుల తరబడి ఇ-నామ్ పోర్టల్ సర్వర్ డౌన్కావడంతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర చేశారు. కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం, ఇ-నామ్ సర్వర్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో అధికారులు రైతులు తెచ్చిన పసుపు పంటకు లాట్ నంబర్ కేటాయిండం లేదు. ఇ-నామ్ సర్వర్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో రెండు రోజులుగా స్లాట్లు బుకింగ్ కావడం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు మూడు రోజులుగా పసుపు రాసుల వద్ద పడిగాపులుగాస్తూనే ఉన్నారు.
ఓ వైపు ప్రతికూల వాతావరణం ఆందోళన కలిగిస్తుంటే మరో వైపు సర్వర్ సమస్యల పేరుతో కొనుగోళ్లు నిలిపివేయడంపై గురువారం అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మార్కెట్లోని కార్యాలయ అద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు, వర్షంతో పాటు ఇతర కారణాలతో మార్కెట్కు సెలవులు, కొనుగోళ్లు తీవ్ర జాప్యం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పసుపుతో తామే నష్టపోయే పరిస్థితులు వస్తు న్నాయని అంటున్నారు. వసతులు, టార్ఫాలిన్లు కావాల్సినన్ని లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినా తమను పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆందోళన విషయంలో తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సముదాయించడంతో, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అధికారుల ప్రకటనతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: