📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Nizamabad: కవిత స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌?

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్‌ ఎన్నికల సమయంలో అభ్యర్థుల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి పదవి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అజారుద్దీన్ ప్రస్తుతం ఏ సభకు సభ్యుడు కాకపోవడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఆయనకు శాసనసభ లేదా శాసనమండలిలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నిజానికి ఎమ్మెల్సీ అవకాశం లేకపోవడంతో అజారుద్దీన్‌ మంత్రి పదవి ఊస్ట్‌ అనే ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలకు తాజాగా ముగింపు పలికే పరిణామం చోటుచేసుకుంది. (Nizamabad) బీఆర్‌ఎస్‌తో విభేదించి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ద్వారా ఖాళీ ఏర్పడింది. తాజాగా ఖాళీ అయిన స్థానంలో అజారుద్దీన్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ భావించడమే దీనికి కారణం.

Read also: Uttam Kumar Reddy: తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ లేదు

Nizamabad: Is Azharuddin the MLC candidate to replace Kavitha?

మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే అజారుద్దీన్‌కు ఉపఎన్నిక?

కవిత రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించడానికి ఆరునెలల సమయం ఉంది. (Nizamabad) అయితే దానికి ముందే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే ఈ సీటుకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలే అందులో ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పరిషత్తుల కాలపరిమితి ముగిసి చాలాకాలం అయింది.  ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి, ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుంది. పరిషత్‌ ఓటర్లు లేకున్నా.. మున్సిపల్‌ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అజారుద్దీన్‌ ఎన్నిక ఇక లాంఛనమే అన్న ప్రచారం సాగతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



azharuddin Congress Party Strategy Kavitha Resignation Latest News in Telugu Ministerial Position MLC Vacancy nizamabad Revanth Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.