📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu News: Nirmal-మగవారి వాయినాల వేడుక.. గాజుల స్థానంలో మద్యం బాటిల్స్

Author Icon By Pooja
Updated: September 14, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nirmal: పురాతన కాలం నుంచి మహిళలు శ్రావణ మాసంలో వ్రతాలు చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా ఉంది. గాజులు, పూజా సామగ్రిని పరస్పరం మార్చుకోవడం మహిళలకే పరిమితమైంది. అయితే పురుషులకు ఈ కార్యక్రమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో వారు కేవలం ఖర్చులు పెట్టడమే పరిమితమయ్యారు. ఈ పరిస్థితిని మార్చాలని భావించిన నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామ యువకులు తమకంటూ కొత్త ఆచారం(New custom) ప్రారంభించారు.

మద్యం బాటిల్స్‌తో వాయినాల వేడుక

మహిళలు గాజులు ఇచ్చిపుచ్చుకుంటే, మగవారు ఎందుకు వెనుకబడాలని అనుకుని యువకులు ప్రత్యేకంగా మద్యం బాటిల్స్‌ను వాయినాలుగా మార్చుకున్నారు. ఒకరికొకరు బొట్లు పెట్టుకుని, కండువాలు కప్పుకుని సాంప్రదాయ వాతావరణంలో బీర్లు, క్వార్టర్ బాటిల్స్ ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ వినూత్న పద్దతిని చూసినవారికి ఆసక్తికరంగా, సరదాగా అనిపించింది. ప్రస్తుతం ఈ కొత్త సంప్రదాయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన మగవారి వాయినాలు

కనకాపూర్‌తో పాటు సోన్ మండలం సిద్ధులకుంటలో కూడా ఈ కొత్త ట్రెండ్(New Trend) విస్తరించింది. వాయినాల పేరుతో మద్యం అమ్మకాలు పెరగడంతో వైన్ షాపులు, మరోవైపు గాజుల షాపులు రెండూ ఫుల్ డిమాండ్‌లో ఉన్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చాలామందికి నవ్వులు తెప్పిస్తున్నాయి. కొత్తగా పుట్టిన ఈ “మగవారి వాయినాలు” ఇప్పుడు వినూత్నమైన సంప్రదాయంగా మారాయి.

మగవారి వాయినాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలో ఈ ఆచారం మొదలైంది.

మహిళల వాయినాల కంటే పురుషుల వాయినాల్లో ఏమి ప్రత్యేకం?
మహిళలు గాజులు ఇచ్చిపుచ్చుకుంటే, పురుషులు మద్యం బాటిల్స్‌ను ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

Read hindi News: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ktrs-anger-over-nagarkurnool-slbc-tunnel-incident/telangana/547002/

Alcohol Exchange Festival Funny Indian Traditions Google News in Telugu Kanakapoor Village Latest News in Telugu Nirmal District News Social Media Viral Videos Telugu News Today Viral Trends

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.