(Nirmal) నిర్మల్ జిల్లా బాసర (Basara) గోదావరి ఒడ్డున చోటుచేసుకున్న అనుమానాస్పద ఘటన కలకలం రేపుతోంది. చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతదేహానికి సమీపంలో పండర్పూర్ విఠలేశ్వరుడి విగ్రహం ఉండటంతో పాటు, అక్కడ పసుపు–కుంకుమతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్
(Nirmal) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా క్షుద్ర పూజల పేరుతో హత్య చేశారా? లేక హత్యను ఆత్మహత్యలా చిత్రీకరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరిస్తూ, మృతుడి వివరాలు, కుటుంబ నేపథ్యం, ఇటీవల అతడి ప్రవర్తనపై సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి నిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: