📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Sridhar Babu – ఆదిలాబాద్ సిమెంటు ప్లాంటును పునరుద్ధరించాలి

Author Icon By Rajitha
Updated: September 9, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిసిఐ ఉన్నతాధికారులతో ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ (Hyderabad) : ఖాయిలా పడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సిఎం రేవంత్ రెడ్డి, తానూ పలు సందర్భాల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెడ్ డి కుమారస్వామిని కలిసి కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిసిఐ సిఎండి సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పునరుద్ధరణ ప్రతిపాదనలపై శ్రీధర్ బాబు చర్చించారు.

మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని

ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించడానికి రూ.2 వేల కోట్లు అవసరమవు తాయని సిఎండి చెప్తున్నారని, అది జరిగితే మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీదర్ బాబు (Sridhar Babu) తెలిపారు. వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఈ భారీ పరిశ్రమను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే రివైవ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కోరారని తెలిపారు.. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా ప్లాంటు ప్రైవేటీకరణను (డిస్ ఇన్వెస్ట్ మెంటును) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పునురుద్దరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సిసిఐ కోరుతోందని, త్వరలోనే దీనిపైన తమ అభిప్రాయాలను అందచేస్తామని వెల్లడించారు.

News Telugu

ఆదిలాబాద్

నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు

రెండు వేల ఎకరాల్లో నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు ఉన్నందున ప్లాంటు నిర్వహణ ఆసాధ్యమేమీ కాదని శ్రీధర్ బాబు చెప్పారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, గనుల శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టిజిఐఐజి (TGIIG) ఎండి శశాంక తాండూరు సిసిఐ ప్లాంట్ జిఎం శరద్ కుమార్, సిసిఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలు కూడా సమావేశానికి హాజరై తమ సూచనలను వెల్లడించారు.

ప్రశ్న 1: ఆదిలాబాద్ సిసిఐ ప్లాంటు పునరుద్ధరణను ఎవరు కోరారు?
సమాధానం: తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

ప్రశ్న 2: ప్లాంటు పునరుద్ధరించబడితే ఎంతమందికి ఉపాధి లభిస్తుంది?
సమాధానం: దాదాపు 3,000 మందికి ఉపాధి లభిస్తుంది.

Read hindi news:

Read Also:

https://vaartha.com/latest-news-accidents-changed-road-accident-times/hyderabad/543892/

Adilabad cement plant Breaking News CCI revival Cement Corporation of India latest news Revanth Reddy Sridhar Babu Telangana industries minister Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.