📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Revanth Reddy- ఏ చిన్నసమస్య వచ్చినా తక్షణమే స్పందించాలి: సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By Sharanya
Updated: August 29, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డి: భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం మెదక్ (Medak) జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అధికారులతో జిల్లాలో భారీ వర్షాలు వరదలపై సమీక్షించారు.

News Telugu

ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకస్మికంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు అని, అటువంటి విపత్తుల సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం ఆప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆస్తి నష్టం పంట నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణనష్టాన్ని అంచనాలకు అనుగుణంగా నష్టపరిహారానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. మెదక్ జిల్లాలో భారీగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాల యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తూ ఉన్నామని రైతులు రాబోవు పంటలకు కూడా ఇప్పటి నుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని, నానో యూరియా పై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు. అనంతరం ఫ్లడ్ ఎవర్టెడ్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు పౌరసరఫరాల మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావ్. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. అదనపు కలెక్టర్ నగేష్ వివిధ అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5.20 నిమిషాలకు మెదక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ ద్వారా చేరుకుని ంచిన అనంతరం అధికారులతో సమీక్షి ఫ్లడ్ ఎఫెక్టైడ్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి 6.20కు తిరుగు ప్రయాణమయ్యారు. వర్షాలు వరదలు ముంచేత్తుతున్న కారణంగా వాగులు చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వరద నష్టాలను అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జిలు కట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kamareddy-heavy-rains-traffic-jam-nh44-breaking-news/weather/537601/

Breaking News immediate response latest news medak Public Issues Revanth Reddy Revanth Reddy orders Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.