హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దిక్కూమొక్కూ లేని పరిస్థితి కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎఎస్ ప్రభాకర్ అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో ఒకవైపున ప్రకృతి వైపరీత్యం కారణంగా కాలువలు పొంగిపోతున్నాయి, వాగులు నిండిపోతున్నాయి, చెరువులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. మరొకవైపు అనేక నగరాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉండటం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పార్టీ రాష్ట్ర మంత్రులతో రాజ్నాథ్ సింగ్ చర్చలు
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) కార్యకర్తలను, ప్రజా ప్రతి నిధులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రులతో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో చర్చలు జరిపారు. బిజెపి కార్యకర్తల యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ ఢిల్లీ మధ్య ముఖ్యమంత్రిని ఫుట్బాల్లా తిప్పుతుం దన్నారు. ఇది కొత్త విషయం కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ (Telangana) రెండింటి లోనూ ముఖ్యమంత్రులను ఫుట్బాల్లా ఆడుకోవడం తరచుగా చూసిన సంగతే. ప్రస్తుతం ఈ ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితికిలోనై హైదరాబాద్ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ, రాజకీ యంగా నలిగిపోతున్నారు. ఇది కాంగ్రెస్లోని అంతర్గత విభజనకు, రేవంత్ రెడ్డి పరిస్థితికి నిదర్శనం.
కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని బీహార్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని, తెలంగాణ నుంచి బీహార్ ట్యాక్స్ వసూలు చేయాలని చూస్తుందన్నారు. ఆయనను ఒక పావు తిప్పుతూ వ్యవహరిస్తున్నారు. ఒకవైపున ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు ఎదురవుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఓటు చోరీ గురించి కొత్తగా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఓటు చోరీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని నాయకుడు. ఒకసారి కూడా ధైర్యంగా పోటీ చేయని ఆయనను కేవలం అధిష్టానం నిర్ణయంతో పదవిలోకి తీసుకురావడం జరిగిందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: