📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

News Telugu: Kunamneni Sambasiva Rao- ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం కాపాడాలి: కూనంనేని సాంబశివరావు

Author Icon By Sharanya
Updated: August 29, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర 4వ మహా సభలు ఘనంగా ముగిశాయని మరొకసారి రాష్ట్ర కార్యదర్శిగా (Secretary of State)తనని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పార్టీ జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు జాతీయ మహాసభలు చండీగఢ్ లో జరుగుతాయన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఫాసిస్ట్ బాటలో పయనిస్తోంది విమర్శించారు.

News Telugu

కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత మరిచి నిరక్ష్యంగా వహిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పకుండా, మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంద న్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.గత పాలకులు కాళేశ్వరం (Kaleswaram) పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని విమర్శించారు. కాళేశ్వరాన్ని హైలెట్ చేస్తూ రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ లను నిరక్ష్యం చేశారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, రైతాంగ సమస్యలపై పోరాటాలు ఉదృతం చేస్తామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. వేలాదిమంది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, అధికారులు వారి గుడిసెలను నిర్ధాక్షిణ్యంగా తొలిగించి నిరాశ్రయులను చేయడం సరికాద న్నారు. పేదల ఇండ్లను కూల్చడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.

సజ్జనార్ పద్దతి మార్చుకోవాలి

ఆర్టీసిని కాపాడుకోవడం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం అవుతామన్నారు. సజ్జనార్ (Sajjanar) ముఖ్యమంత్రా? లేకపోతే మంత్రినా? ఆర్టీసి ఎండినా? అని ప్రశ్నించారు. సజ్జనార్ పద్దతి మార్చు కోవాలన్నారు. ఆయన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు, అట్లాంటి భయానక వాతావరణం ఆర్టిసి కార్మికుల పట్ల సృష్టిచడం సరైంది కాదని హెచ్చరించారు. ఆర్టీసి కార్మికుల పట్ల సజ్జనార్ పద్దతి మార్చుకోక పోతే ప్రత్యేక ఉద్యమాలు రూపొందించాల్సి వస్తుందని హెచ్చరించారు. సజ్జనార్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 26న కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభనిర్వహించబోతున్నట్టు కూనంనేని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట త్యాగాల్ని, ప్రభుత్వం గుర్తించాలని.. సాయుధ వారోత్స వాలను జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఈ నెల 30న పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను రవీంద్ర భారతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. సభకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిం చామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్, సిపిఎం పార్టీలు కలిసొచ్చిన చోట కలిసి పోటీ చేస్తామని పొత్తు లేని చోట ఒంటరిగా బరిలో నిలుస్తామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-heavy-rain-khammam-district-rainfall/telangana/537667/

Breaking News CPM leader government responsibility kunamneni sambasiva rao latest news public sector companies Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.