📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

News Telugu: Heavy Rain- ఖమ్మం జిల్లాలో దంచి కొట్టిన వర్షం

Author Icon By Sharanya
Updated: August 29, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రహదారులు జలమయం.. పొంగిన చెరువులు, కుంటలు.. స్తంభించిన ప్రజాజీవనం

ఖమ్మం: రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం దంచి కొట్టింది. ఫలితంగా ప్రజాజీవనం స్తంభించింది. చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సత్తుపల్లి (Sattupalli) లో ఎన్నడూ కురవనంత 75 మిల్లి మీటర్ల వర్ష పాతం నమోదవ్వడంతో ఆప్రాంత ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రాలేక పోయారు. జలాశయాలన్ని నిండుకుండాల తలపిస్తున్నాయి.

News Telugu

ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టిదిబ్బ పనులకు ఆటంకం

ఇల్లందు, మణుగూరు, కొయ్యగూడెం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో 2 లక్షల కాస్ట్ గనులో 5.25 లక్షల వేల క్యూబిక్ మీటర్ల మట్టిదిబ్బ పనులకు ఆటంకం ఏర్పడింది. ఖమ్మంను మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓపెన్ అనుకుని ప్రవహిస్తున్న మున్నేరు నది నిలకడగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. రాత్రికి మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్ట్ నిండి నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు, కాలేజ్ లకు సెలవు ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లాల కలెక్టర్లు అనూదీప్ దూరిశెట్టి, జితేష్ త్రిపాఠి, ఖమ్మం సిపి సునీల్ దత్, భద్రాద్రి ఎస్పీ రోహిల్రాజ్ వరద ప్రవహిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రమాదకరంగా పొంగుతున్న వాగులు, చెరువుల వద్ద పోలీస్ పహారా ను ఏర్పాటు చేశారు. తీవ్ర వర్ష ప్రభావం ఉన్నందున ప్రజలు ఎవ్వరూ ఇండ్లలో నుంచి బయటకు రావొద్దని వారు సూచించారు. జిల్లాలో 8.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సత్తుపల్లి మండలంలో 17.5, ఖమ్మం రూరల్ లో 12.6, చింతకాని లో 12.4, కొనిజర్ల లో 12 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

సత్తుపల్లి లో రాకపోకలు నిలిపివేత

సత్తుపల్లి లోని రాజీవ్ నగర్ రోడ్డుకు వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిపివేశారు. కృష్ణరం, యాతాల కుంట గ్రామాల మధ్య వరదల వల్ల రహదారులు మూసివేశారు. అడవిలో నుంచి రోడ్డుపైకి నీరు ఉదృతంగా ప్రవహించడంతో కాకర్లపల్లి రోడ్డు జలమయమైంది. సత్తుపల్లి సమీపంలోని నేషనల్ హైవే పైన 2 అడుగులపై నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు పహారా కాస్తూ, వాహనాల ను నిలిపివేశారు. తల్లడ సమీపంలోని బిల్లుపాడు, రామచంద్ర పురం, వెంగన్న పేట, నూతనకల్లు గ్రామాల మధ్య వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. ఏన్కూరు మండలం రేపల్లెవాడ, నాచారం గ్రామాల మధ్య పగిడేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వైరా మండలం హాసనాగుర్తి. ప్రొద్దు టూరు, పాలడుగు, వల్లపురాం గ్రామాల మధ్య చింత కాని మండలం ఖమ్మం, బోనకల్ రహదారిపై రామకృష్ణ పురం వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అధికారులు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బోనకల్లు మండలం పెద్ద వీరవేల్లి, చిన్న వీరవేల్లి గ్రామా మధ్య పెద్ద వాగు ఉదృతం గా ప్రవహిస్తోంది. తకె పాడు, బనిగండ్ల పాడు గ్రామాల మధ్య వాగు ఉధృతి రాకపోకలు నిలిచి పోయాయి. రఘునాథ పాలె మండలం పాపాటపల్లి, విఆర్ బంజారా గ్రామాల మడా ఉన్న బుగ్గవాగు పొంగి ప్రవహిస్తోంది. అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు భారీ వర్షాల నేపథ్యంలో సెలవుల్లో ఉన్న ఉద్యోగులు తక్షణమే తమ విధుల్లో జాయిన్ అవ్వాలని ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని భారీ వర్షాలు కురిసే అవకాశా ఉన్నందున ప్రజల, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడా లని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగ లేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లా ల కలెక్టర్ల ను ఆదేశా చారు. అలాగే చెరువులు, వాగులకు గండ్లు పడే ప్రమాణా ఉన్నందున జిల్లా నీటిపారుదల శాఖ అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రుల సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-revanth-reddy-responds-on-public-issues/telangana/537618/

Breaking News flood situation Heavy Rain Khammam weather latest news monsoon rains Telangana rain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.