News Telugu: భారీవర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు నీటమునిగాయి. దీంతో ప్రజల ఇబ్బందులను గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పార్టీ శ్రేణులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే వరదప్రాంతాలకు వెళ్లి, సాయం చేయాలని కోరారు. ఇప్పటికే కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్లలో వరదబాధితులను కలిసి, వారి కష్టాలపై సమీక్ష నిర్వహించేందుకు బయలుదేరారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: