📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

News Telugu: Bhadrachalam Crime- కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి బాలికపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్​ రేప్

Author Icon By Sharanya
Updated: August 25, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఏజెన్సీలో 17 ఏళ్ల ఆదివాసీ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆటో డ్రైవర్లు (Auto drivers) ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News Telugu:

బాధితురాలి నేపథ్యం

బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన బాలిక. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తన బంధువులను కలుసుకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాలిక బస్సు మిస్ కావడంతో కుంట బస్టాండులో ఆగి ఉండగా, అక్కడికి వచ్చిన ఓ ట్రాలీ ఆటోలో ఎక్కింది. ఆ ఆటోలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఆమెను ఏపీలోని చట్టి – ఏడురాళ్లపల్లి మధ్యలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

మత్తులోకి నెట్టిన నేరస్థులు

నిందితులు బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు (Drug mixed in cool drink) కలిపి ఇవ్వాలని ప్రయత్నించారు. తొలుత ఆమె నిరాకరించినా, “మేము కూడా తాగుతున్నాం, ఏమీ కాదు” అని నమ్మించి తాగించారు. దాంతో బాలిక మత్తులోకి జారుకోగా, ఆ దుర్మార్గులు ఘోర అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు బాలికను రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలేసి పారిపోయారు. మత్తులో స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు గుర్తించి దగ్గరలోని పీహెచ్‌సీకి తరలించారు.

పోలీసు కేసు నమోదు

వైద్యుల సూచన మేరకు చైల్డ్‌లైన్ సిబ్బంది జోక్యం చేసుకుని బాలికను కొత్తగూడెంలోని శక్తి సదన్‌లో చేర్చారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు ఆధారంగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును చింతూరు పోలీసులకు బదిలీ చేశారు.

దర్యాప్తు, గాలింపు చర్యలు

బాలిక శరీరంపై పంటి గాట్లు, గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం కేసును నమోదు చేసి, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ పరిధిలోని పోలీసు బృందాలు నిందితులను వెతకడం ప్రారంభించాయి. ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలిని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు, చైల్డ్​లైన్​ సిబ్బంది పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-mahesh-kumar-goud-bandisanjay-fake-votes-brs-splits/telangana/535700/

auto drivers crime Bhadrachalam crime Breaking News drugged drink assault Gang rape case latest news minor girl abuse Telangana Crime News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.