📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Jogulamba Gadwala: భర్తను చంపిన నవ వధువు.. కేసులో విస్తుపోయే విషయాలు

Author Icon By Sharanya
Updated: June 24, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితురాలు ఐశ్వర్యతో పాటు, ఆమె ప్రియుడు తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ (Supari Gang) సభ్యుల హృదయాలను కలిచివేసే నిజాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి.

వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది

తేజేశ్వర్‌కి కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో మే 18న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం జరిగింది. తేజేశ్వర్ కుటుంబం కట్నం తీసుకోకుండా, ముద్దుగా చూసిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఐశ్వర్యకు అప్పటికే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న వివాహితుడైన తిరుమలరావుతో గాఢమైన ప్రేమ సంబంధం కొనసాగుతోంది. ఫిబ్రవరిలో తేజేశ్వర్‌తో పెళ్లి కుదరగానే ఐశ్వర్యను తిరుమల రావు తన ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ అతని కుటుంబంతో ఇబ్బందులు తలెత్తడంతో ఉండలేక ఇంటికి తిరిగొచ్చింది ఐశ్వర్య.

కలుసుకోవాలన్న కోరికే హత్యకు కారణం

తేజేశ్వర్‌నే పెళ్లి చేసుకుని తిరుమలరావుతో సంబంధం కొనసాగించాలని అనుకుంది. అందుకే వివాహం అయిన తరువాత కూడా ఐశ్వర్య తిరుమలరావుతో సంబంధాన్ని కొనసాగించేందుకు కర్నూలులో ఉండాలని ప్రయత్నించింది. కానీ తేజేశ్వర్ గద్వాల నుంచి కదలకపోవడంతో అతనిని హత్య చేయాలని కుట్ర పన్నింది.

GPS ట్రాకర్ – భార్య చెడు ప్లాన్

ఈ హత్యకి ముందు తేజేశ్వర్‌ బైక్‌కి GPS ట్రాకర్ పెట్టిందన్న విషయం పోలీసుల విచారణలో బయటపడింది. దీని ద్వారా అతని గమ్యస్థానాలు తెలుసుకుని, హత్యకి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఇది కేసులో మెలికలు తిరిగే మలుపుగా మారింది.

సుపారీ గ్యాంగ్ రంగంలోకి

తిరుమలరావుతో కలిసి కర్నూలు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు. తేజేశ్వర్‌ను ఈ నెల 17న భూమి సర్వే పేరుతో కారులో తీసుకెళ్లారు. మొగలిరావు చెరువు నుంచి వీరాపురం కృష్ణస్వామి ఆలయం వద్ద, అతడిని మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆయుధాలు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేసి, మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేశారు. పెళ్లైన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూలులో గడిపింది. నాలుగు నెలల్లో తిరుమలరావుతో 2,000కి పైగా ఫోన్‌కాల్స్ మాట్లాడటంతో పాటు వందల సందేశాలు పంపింది.

పోలీసుల దర్యాప్తు – కీలక పురోగతి

ఈ కేసులో గద్వాల ఎస్పీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఐశ్వర్య, ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని గద్వాల ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. కాగా తిరమలరావుకు ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

మొదట భార్యను చంపి, అనంతరం తేజేశ్వర్‌ను కూడా హత్య చేయించాలని తిరుమలరావు భావించినట్లు సమాచారం. అయితేభార్యను హత్య చేస్తే కుటుంబ సభ్యులు, బంధువుల్లో చెడు పేరు వస్తుందని తిరుమలరావు వెనక్కి తగ్గాడు. తేజేశ్వర్ హత్య తర్వాత కొన్నాళ్ళు లడక్ వెళ్లి అక్కడే ఉండాని తిరుమల్ రావు, ఐశ్వర్య భావించారు. తేజేశ్వర్‌ను పరశురామ్, రాజు, నాగేష్ హత్య చేశారు. కారు ముందు సీటులో కూర్చున్న తేజేశ్వర్‌ గొంతు కోశారు ఇద్దరు నిందితులు. డ్రైవింగ్ చేస్తూ తేజేశ్వర్‌పై మరో నిందితుడ నాగేష్ కత్తితో దాడి చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ముగ్గురు నిందితులు తిరుమలరావుకు చూపించారు. దీంతో నిందితులకు తిరుమలరావు 2 లక్షలు పంపాడు. కేసులో కీలక సూత్రధారి తిరుమలరావు ఇంకా పరారీలోనే ఉన్నాడని ఎస్పీ తెలిపారు.

Read also: Board of Education: ప్రత్యేక జర్నల్ను ప్రారంభించిన ఉన్నత విద్యామండలి

#AishwaryaMurderPlan #crimenews #GadwalUpdates #JogulambaGadwal #SupaariGang #TejeshwarMurder Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.