📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Latest News: New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

Author Icon By Saritha
Updated: December 15, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు(New Year Celebrations) అప్రమత్తమయ్యారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో నగరంలో పబ్స్, హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్‌లు సందడిగా మారనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(PC Sajjanar) ఈ మేరకు కీలక ఆదేశాలు విడుదల చేశారు. ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలన్నా, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read also: TG: రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

New Year Celebrations CP Sajjanar issues key guidelines for New Year celebrations.

వేడుకల నిర్వహణకు కఠిన నిబంధనలు

పోలీసులు(New Year Celebrations) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 31న పబ్స్, బార్లు, హోటల్స్, క్లబ్‌లు, రెస్టారెంట్లలో వేడుకలు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే నిర్వహించాలి. మైనర్లకు ఈవెంట్లలో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. ప్రతి ఈవెంట్ ప్రాంగణంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. అశ్లీల కార్యక్రమాలు నిర్వహించరాదు. ఈవెంట్ నిర్వాహకులు కనీసం 15 రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలి.

రోడ్లపై బహిరంగంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై నిషేధం విధించారు. ఇండోర్ హాల్స్‌లో మాత్రమే రాత్రి 1 గంట వరకు సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఉంటుంది. రాత్రి 10 గంటల తర్వాత శబ్దం 45 డెసిబెల్స్‌ను మించకూడదు. ఈవెంట్లలో ఆయుధాలు, మత్తు పదార్థాలకు అనుమతి లేదు. వేదిక సామర్థ్యాన్ని మించి టికెట్లు జారీ చేయరాదు. మద్యం సేవించిన వారికి డ్రైవర్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CelebrationRules CityAlerts HyderabadPolice Latest News in Telugu NewYearGuidelines PublicSafety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.