📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telugu News: KGBV: కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్

Author Icon By Tejaswini Y
Updated: November 17, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (KGBV)ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకచర్యలు తీసుకోనుంది. విద్యార్థినుల ఆరోగ్య రక్షణకోసం హైదరాబాద్ లోని పాఠశాల విద్య డైరక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో ఒక ఎంబిబిఎస్ డాక్టర్ను నియమించనున్నారు. స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోని విద్యార్థినుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలను అక్కడే ఉన్న ఏఎన్ఎం ద్వారా కమాండ్ కంట్రోల్లో ఉన్న డాక్టర్కు వివరిస్తారు. సమస్యను తెలుసుకున్న అనంతరం డాక్టర్ పిల్లలకు అవసరమైన మందులను కానీ లేదంటే అవసరమైన చికిత్సను గానీ అదీ కాకుండా ఇన్పషంట్గా ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తే అటువంటి విషయాన్ని ఏఎన్ఎంకు వివరిస్తారు. తద్వారా వారికి వెంటనే చికిత్సను అందించాలని అధికారులు భావిస్తున్నారు.

Read also : CII Summit: డబుల్ ఇంజన్ సర్కారుపై పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం

New command control for KGBV students

ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా.. కేజీబీవీల్లోని విద్యార్థినులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా.. ఒకవేళ వచ్చినా వెంటనే వాటికి సంబంధించిన చికిత్సను అందించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యశాఖ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో 495 కేజీబీవీలు కొనసాగుతుండగా..

రాష్ట్రంలో 495 కేజీబీవీలు కొనసాగుతుండగా.. వాటిల్లో సుమారు 1.50 లక్షల మంది విద్యార్థినులు విద్యను కొనసాగిస్తున్నారు. డీఎస్ఈలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కేజీబీవీల్లో విద్యార్థినుల హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా విద్యార్థినులకు సంబంధించి బ్లడ్ టెస్ట్ను చేస్తారు, విద్యార్థినుల వయస్సు, వారి వయస్సు మేరకు ఎంత హైట్ ఉండాలి.. వీరు ఎంత ఉన్నారు.. దాంతోపాటు వారికి ఉన్నటువంటి ఇతర రుగ్మతలను విద్యార్థిని హెల్త్ ప్రొఫైల్లో రికార్డు చేస్తారు.

ఇలా రాష్ట్రంలోని అన్ని కేజీబీవీల్లోని(KGBV) విద్యార్థినుల వివరాలను సేకరించనున్నారు. వాటిని సేకరించిన అనంతరం వారికి సంబంధించి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే వారికి అవసరమైన చికిత్సను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు రావడంతోపాటు జ్వరాలు రావడం.. రెండు, మూడు రోజులైన జ్వరం తగ్గకపోతే ప్రధానంగా అటువంటి వారికి అందించాల్సిన చికత్సలను కమాండ్ కంట్రోల్లోని(Command Controll) డాక్టర్ స్థానిక ఏఎన్ఎంలకు వివరిస్తారు. తద్వారా చికిత్సను కొనసాగిస్తారు. అలాగే ఫుడ్పాయిజన్ జరిగినా, వాటర్ పొల్యుషన్ అయినా తద్వారా వచ్చే ఇబ్బందులను కూడా తెలుసుకుని వాటికి విద్యార్థినులకు చికిత్సను అందించేలా చూడనున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

command control center Digital Monitoring DSC Hyderabad Education Monitoring Girls Education KGBV Students school safety Telangana Education

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.