Sunburn : తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి!

Read Time:  1 min
Nearly 30 people die of heatstroke in Telangana!
Nearly 30 people die of heatstroke in Telangana!
FONT SIZE
GET APP

Sunburn : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణలో కొడుతున్న ఎండల దాటికి.. పిట్టల్లా జనాలు రాలిపోతున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు దాదాపు 30 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అదే సమయంలో వడతీవ్రత విపరీతంగా పెరుగుతుంది. 9 దాటిందంటే చాలు బయట అడుగుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జనాలు పిట్టల రాలిపోతున్నారు.

తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది

రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు

ఈ తరుణంలోనే గడిచిన మూడు రోజుల్లో మొత్తం 30 మంది జనాలు మరణించారు. ఇందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎండాకాలంలో 9 తర్వాత బయటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితిలో నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వస్తున్నాయి. ఏపీలోని ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం అలాగే మన్యం జిల్లాలలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి.

వర్షాలు పడితే కచ్చితంగా రాళ్ల వాన

మరో 28 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. పలుచోట్ల ఉరుములు అలాగే మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే కచ్చితంగా రాళ్ల వాన పడుతుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇలాంటి నేపథ్యంలో వరి కోత పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుంచి బయటపడేందుకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బయటికి వెళ్లేవారు కచ్చితంగా మంచినీళ్లు తాగి వెళ్లాలని సూచిస్తున్నారు. లేదా ప్రతిరోజు మజ్జిగ తాగాలని.. చెబుతున్నారు. బయటకు వెళ్తే టోపీ లేదా కచ్చితంగా కర్చీఫ్ అయినా కట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Read Also: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ చీఫ్ ఏమన్నాడంటే !

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.