National Medical Commission: దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల సంఖ్యను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) పెంచింది. ఈ పెంపులో తెలంగాణకు మొత్తం 60 సీట్లు లభించాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 36 సీట్లు, ప్రైవేట్ కాలేజీలకు 24 సీట్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 21 సీట్లు మంజూరయ్యాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలకు 14 సీట్లు, ప్రైవేట్ కాలేజీలకు 7 సీట్లు ఉన్నాయి.
Read Also:AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?
న్యూరో, క్యాన్సర్, కిడ్నీ వైద్య నిపుణులు రాష్ట్రాల్లోనే తయారీ
సూపర్ స్పెషాలిటీ సీట్ల పెంపుతో కిడ్నీ, క్యాన్సర్, న్యూరో వంటి కీలక విభాగాల్లో నిపుణులైన వైద్యులు రాష్ట్రాల్లోనే తయారుకానున్నారు. దీంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుందని వైద్య విద్యా వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: