हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Narsingi: ఐదంతస్తుల అక్రమ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు

Tejaswini Y
Narsingi: ఐదంతస్తుల అక్రమ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు

Narsingi : నకిలీ ఎస్ఆర్ఎస్ఈ, ప్రజోపయోగకరమైన సెప్టిక్ ట్యాంక్ స్థలాన్ని కబ్జాచేసి నిర్మించిన ఐదంతస్థుల భవనంను బుధవారం హైడ్రా అధికారులు సీజ్ చేశారు. నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాంపూర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో సెప్టిక్ ట్యాంక్, కమ్యూనిటీహాల్, పార్కులకు స్థలాలను వదిలిపెట్టారు. ఇక్కడ భూముల విలువ అమాంతం పెరుగడంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడింది. ఎలాగైనా కొట్టేయాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. 1996 టెంటేవ్ లేఔట్ను ఆమోదించబడిన లేఔట్గా చూపిస్తూ, నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టించారు.

Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

Narsingi: Hydra officials seize five-story illegal building
Narsingi: Hydra officials seize five-story illegal building

స్థలాలను ఆక్రమించి భారీ అపార్టుమెంట్లు

కమ్యూనిటీహాల్, సెప్టిక్ ట్యాంక్ స్థలాలను ఆక్రమించి భారీ అపార్టుమెంట్లు నిర్మించారు. సెప్టిక్ ట్యాంక్ స్థలంలో ఇంటి నెంబర్, అసెస్మెంట్లను చూపించి హెచ్ఎండిఏ అనుమతులు పొందినట్ల అధికారులు గుర్తించారు. వీరు సమర్పించిన ఎల్ఆర్ఎస్ పత్రం నకిలీదని హెచ్ఎండిఏ నిర్ధారించినట్లు హై డ్రా అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర కాల నీ అసోసియేషన్ సభ్యులు ఈ కబ్జాల విషయంపై కోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ఆధారంగానే అక్రమాల డొంకంతా కదులుతున్నట్లు సమాచారం. స్థానికంగా పని చేసిన మణికొండ మున్సి పల్ అధికారులకు అంతా తెలిసినా, తమకేమీ తెలియనట్లు గుడ్డిగా అక్రమ భవనాలను నిర్మించే బిల్డర్లకు సహకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అధికారులు నెక్నాంపూర్ డివిజన్(Neknampur Division) వెంకటేశ్వర కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలంలో నిర్మించిన ఐదంతస్థుల భవనంను సీజ్ చేసిన హైడ్రా అధికారులు తమ చేయి తడిపితే ఏ పని అయినా చేస్తారంటూ మణికొండలోని ప్రజలు మండి పడుతున్నారు. బుధవారం హైడ్రా అధికారులు ఐదంతస్థుల భవనం ను సీజ్ చేసినట్లు తెలిపే బోర్డును ఆ భవనం వద్ద పాతారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజోపయోగం కోసం వదిలిన స్థలాలు, చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేస్తే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని, తిరిగి కబ్జాదారుల నుంచి లాక్కుంటుందని హైడ్రా అదికారులు స్పష్టం చేశారు. హైడ్రా చర్యను మణికొండ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి నిజా యితీ గల సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని, అక్రమాలకు పాల్పడే వారిని కఠినం గా శిక్షించాల్సిన అవసరం ఉందని పుర ప్రముఖులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870