📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Narayanpet Municipality: మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి

Author Icon By Tejaswini Y
Updated: February 14, 2026 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Narayanpet Municipality: నారాయణపేట పట్టణ కేంద్రంలోని 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బి. జయశ్రీ భారతీయ జనతా పార్టీ లో చేరారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే. రామచంద్రరావు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు గత మున్సిపల్ ఎన్నికల్లో జయశ్రీ రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

10వ వార్డులో మొత్తం 1256 మంది ఓటర్లు ఉండగా, అందులో 1023 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి అనుషకు 160 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సిద్ధి విజయలక్ష్మికి 386 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 12 ఓట్లు లభించాయి.

Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?

Narayanpet Municipality: BJP one step away from the magic figure

స్వతంత్ర అభ్యర్థి జయశ్రీకి 451 ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించారు జయశ్రీ బీజేపీలో చేరడంతో నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల(BJP councilors) సంఖ్య 12కు చేరింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జయశ్రీ తెలిపారు. ఇదిలా ఉండగా నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 కౌన్సిలర్లు ఉండగా ఇప్పటికే బిజెపి సంఖ్య 12 కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ 13 కావడంతో మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నది. కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలుపొందగా బీఆర్ఎస్ రెండు స్థానాల్లో, ఎంఐఎం రెండు స్థానాల్లో గెలుపొందాయి. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Telangana Independent Councillor Joins BJP K. Ramachandra Rao Narayanpet Municipality Narayanpet Politics Telangana Municipal Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.