📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Pawan Comments : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నారాయణ తీవ్ర అభ్యంతరం

Author Icon By Sudheer
Updated: June 2, 2025 • 8:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan) చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైలులో పెడతామని పవన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నారాయణ అన్నారు. “సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్న పవన్ కల్యాణ్‌ను కూడా అప్పుడు జైలులో పెట్టాలి” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే ఆయన దృష్టి పెట్టాలని హితవు పలికారు.

తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా పేదల పరిస్థితుల్లో మార్పు లేదు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా పేదల పరిస్థితుల్లో మార్పు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని, అటువంటి ఉద్యమానికి సీపీఐ పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ మాత్రమే తెలంగాణ కోసం పోరాటం చేసిన ఘనత పొందిందని, అప్పటి సమయంలో తనపై జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేశారు.

కేసీఆర్ తీరు సరైంది కాదు

తెలంగాణ ఉద్యమంలో సీపీఐ పోషించిన పాత్రను వివరిస్తూ, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో ప్రొఫెసర్ కోదండరాం వంటి కీలక వ్యక్తులను రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్కన పెట్టిన తీరు సరైనది కాదని విమర్శించారు. తమ స్వార్థాల కోసమే తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఆరోపించారు. తమిళనాడు సీఎం కరుణానిధి ఆరోగ్య సమస్యల మధ్యలో కూడా కార్యాలయానికి వచ్చి పాలన చేశారని, కానీ కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో ఉండి పాలన సాగించడాన్ని విమర్శించారు. సీపీఐ ప్రజల కోసం నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Read Also : Transgender : ట్రాన్స్‌జెండర్ విషయంలో కేర‌ళ హైకోర్టు సంచలన తీర్పు

CPI Narayana Pawan Kalyan pawan kalyan sanatan dharmam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.