📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Nalgonda Court: బిడ్డ జీవితాన్నే నాశనం చేయాలనుకున్న తల్లికి 20 ఏళ్ల జైలు శిక్ష..

Author Icon By Anusha
Updated: August 13, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జంతువులు కూడా తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతాయి. కానీ మనిషి సమాజంలో విచక్షణా జ్ఞానం ఉన్నప్పటికీ, స్వార్థం, కామం అనే అంధకారంలో కొంతమంది తల్లిదండ్రులు ఉండిపోతున్నారు. పసిపాపల నుంచి పండుముసలివారిదాకా కామాంధుల బారిన పడుతున్న సంఘటనలు పెరుగుతున్న ఈ కాలంలో, తల్లిదండ్రులే తమ పిల్లలకు రక్షణగా ఉండాలి. కానీ నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో, తల్లే తన కుమార్తెకు శత్రువుగా మారి, జీవితాన్ని నాశనం చేసింది.నల్లగొండకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలి, ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగించింది. ఈ సంబంధాన్ని కొనసాగించడానికి ఆమె ఏ స్థాయికైనా దిగజారింది. అంతేకాక, తనకున్న కూతురిని కూడా ఆ ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేయాలని ప్రణాళిక వేసింది. కానీ, ఆ కుమార్తె ఈ వివాహానికి అంగీకరించలేదు. అందుకు అంగీకరించని కుమార్తెపై తన ప్రియుడి చేత అత్యాచారం చేయించింది.ప్రియుడి చేత అసభ్యరకర వీడియోలు తీయించింది.

రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కేసు

రెండేళ్ల క్రితం నల్లగొండ లో ఈ దారుణం వెలుగు చూసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా ఈ కేసులో నల్లగొండ జిల్లా న్యాయమూర్తి రోజారమణి మంగళవారం నాడు సంచలన తీర్పు వెల్లడించారు. బాలిక తల్లికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా.. జరిమానా కూడా విధించారు. ఆ వివరాలు..నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రం లైన్‌వాడి ప్రాంతానికి చెందిన గ్యారాల శివకుమార్‌ అనే వ్యక్తికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈక్రమంలో అతడికి బీటీఎస్ కాలనీలో ఉంటున్న యాదమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. యాదమ్మకు 14 సంవత్సరాల కుమార్తె ఉంది. యాదమ్మతో వివాహేతర బంధం పెట్టుకున్న శివకుమార్.. ఆమె కుమార్తె మీద కూడా కన్నేశాడు.

Nalgonda Court

ప్రియుడితో కలిసి దారుణం

ఈక్రమంలో శివకుమార్, యాదమ్మ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ఆమెని ఒప్పించాడు. అయితే బాలిక అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన యాదమ్మ, కన్న బిడ్డ అనే కనికరం కూడా లేకుండా చిన్నారిని చితకబాదింది. ఆపై ప్రియుడితో కలిసి కన్న బిడ్డను అభ్యంతరకర రీతిలో వీడియో తీయించింది. ఆ తర్వాత శివ కుమార్ దాని ద్వారా బాలికను బెదిరించి, ఆమెపై అత్యాచారం చేశాడు.అనంతరం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలిక, స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు శివకుమార్, తల్లి యాదమ్మల మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, కోర్టులో దాఖలు చేశారు. ఈక్రమంలో మంగళవారం నాడు కేసు విచారణకు వచ్చింది.

న్యాయస్థానం సంచలన తీర్పు

ఉదయం తీర్పు కోసం వాయిదా పడగా, తనకు శిక్ష పడుతుందని గ్రహించిన నిందితుడు, మూత్రశాలకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.అనంతరం న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితులిద్దరిపై పోక్సో చట్ట ప్రకారం నేర నిర్ధారణ అయిందని ప్రకటించారు. కన్న బిడ్డ అని కూడా చూడకుండా.. ముక్కుపచ్చలారని బాలిక మీద ప్రియుడి చేత అత్యాచారం చేయించినందుకు 20 ఏళ్లు.. బాల్యం వివాహం చేసినందుకు మరో రెండేళ్లు జైలు శిక్షతో పాటుగా 5 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ఇక ఈ కేసులో ఏ-1గా ఉన్న శివకుమార్‌పై న్యాయస్థానం.. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మళ్లీ అతడిని కోర్టులో ప్రవేశపెట్టిన నాడే.. శిక్ష విధిస్తారు.

ఈ కేసులో కోర్టు ఏ శిక్ష విధించింది?

నిందితురాలికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

కోర్టు ఈ తీర్పుతో పాటు ఇంకేమి విధించింది?

జరిమానా కూడా విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/focus-should-be-placed-on-the-development-of-eco-tourism/hyderabad/529756/

20 years prison boyfriend involvement Breaking News Extramarital affair forced marriage latest news minor girl assault mother jailed nalgonda crime objectionable videos physical abuse Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.