📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు

Nalgonda: నకిలీ బంగారం దొంగల ముఠా అరెస్ట్

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 6:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతరాష్ట్ర నకిలీ బంగారం(Gold) దొంగల ముఠా స‌భ్యుల‌ను న‌ల్ల‌గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. (Nalgonda) నిందితుల వ‌ద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివ‌రాల‌ను న‌ల్ల‌గొండ డీఎస్పీ కె.శివ‌రాంరెడ్డి శ‌నివారం వెల్ల‌డించారు. 16 డిసెంబ‌ర్‌, 2025న నల్ల‌గొండ వన్ టౌన్ పట్టణ పరిధి నెహ్రూగంజ్ ప్రాంతంలోని వినాయక కిరాణా షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు వ‌చ్చి కిరాణా సామ‌ను తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే దుకాణ యజమానితో పరిచయం చేసుకుని, మాటలు కలిపి పాత బంగారం తక్కువ ధరకు రూ.15 లక్షల విలువైన బంగారం కేవలం రూ.5 లక్షలకే ఇస్తామని నమ్మించారు.

Read also: Sambasiva Rao: మోదీపై కూనంనేని వ్యాఖ్యలు..స్పందించిన కిషన్ 

వివ‌రాలు వెల్ల‌డించిన న‌ల్ల‌గొండ డీఎస్పీ కె.శివ‌రాంరెడ్డి

న‌మ్మిన షాప్ య‌జ‌మాని బ్యాంక్‌ వద్దకు తీసుకెళ్లి రూ.5 లక్షలు డ్రా చేసి వారికి ఇచ్చాడు. కాగా వారు అత‌డికి న‌కిలీ బంగారాన్ని అంట‌గ‌ట్టారు. (Nalgonda) దీంతో తాను మోస‌పోయిన‌ట్లు గుర్తించి బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసి ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ ఆదేశానుసారం త‌న (డీఎస్పీ శివరాం రెడ్డి) ఆధ్వర్యంలో వన్ టౌన్, సీసీఎస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

శుక్ర‌వారం నల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని ప్ర‌కాశం బజార్‌లో నిందితులు ఉన్నార‌న్న విశ్వ‌స‌నీయ సమాచారం మేరకు రైడ్ చేసి వారిని ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. నిందితులు ఏడుగురు రాజ‌స్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా వెల్ల‌డించారు. ఏ1-రమేశ్ కుమార్ (30), ఏ2-పురన్ కుమార్ (ప్ర‌స్తుతం పరారీలో ఉన్నాడు), ఏ3-రాజా రామ్ (38), ఏ4-మహేంద్ర కుమార్ (19), ఏ5-మానా రామ్ (38), ఏ6-సురేశ్ కుమార్ (28), ఏ7- దేవా రామ్ (45). వీరు ప్లాస్టిక్ వ‌స్తువుల అమ్మ‌కం పేరుతో ప‌ట్ట‌ణ శివారులోని క‌తాల‌గూడెం శివారులో గుడిసెలు వేసుకుని కుటుంబ స‌భ్యుల‌తో జీవిస్తున్న‌ట్లు చెప్పారు. కేసును విజ‌య‌వంతంగా చేధించిన డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజ శేఖర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐలు లచ్చిరెడ్డి, వెంకట నారాయణ, సిబ్బంది విష్ణు, రబ్బానీ, అంజయ్య, సి‌సి‌ఎస్ సిబ్బంది వహీద్, దస్తగిరి, మహేశ్, నాగరాణిని ఎస్పీ అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Crime News Telangana Fake gold Gold Thieves Arrested Interstate Gold Theft Latest News in Telugu Nalgonda Police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.