హైదరాబాద్ : తెలంగాణాలో నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavancha Railway Station) తిరిగి ప్రారంభమైంది. ప్రయాణీకులు లేని కారణంగా ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాలు ఆందోళనకు దిగడంతో రైల్వే అధికారులు స్పందించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ ను తిరిగి పునఃప్రారంభిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ చీఫ్ బుకింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాగులవంచ స్టేషన్ టికెట్ కౌంటర్ను ఆదివారం తిరిగి ప్రారంభించారు. విద్యార్థులు, కార్మికులు రైల్వేప్రయాణం (Railway journey) ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రయాణికులు లేరని మూసివేయడం భావ్యం కాదన్నారు. అంతకు ముందు ప్రకటన ఉత్వర్వులను వెనక్కి తీసుకోవాలని ఇటీవల అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
అభివృద్ధి పనుల పేరిట టికెట్ కౌంటర్ను
సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్టేషన్ భవిత వ్యంపై స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు, వ్యాపారులకు ఈ రైల్వే స్టేషన్ రవాణాకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అధికా రులకు వివరించారు. గత కొన్ని రోజుల నుంచి ఈ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల పేరిట టికెట్ కౌంటర్ను మూసివేశారు. కానీ వారం రోజుల కిందట ప్రయాణికుల రద్దీలేని. కారణంగా స్టేషన్ మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో స్థాని కుల ఆగ్రహానికి గురయ్యారు. నాగులవంచ స్టేషన్ పునఃప్రారంభంతో భవిష్య త్తులో ఈ ప్రాంత ప్రజలకు రవాణా వ్యవస్థ మెరు గుపడుతుందని ఆశిస్తున్నారు. ఇక నుంచి ప్రయా ణికులు విజయవాడకు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేయవచ్చు.
హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?
హైదరాబాద్ రైల్వే స్టేషన్, అంటే నిజామాబాద్ వైపు వెళ్లే ప్రధాన నాంపల్లి (Nampally) రైల్వే స్టేషన్ నగరంలోని మధ్య ప్రాంతంలో ఉంది. దీనిని సాధారణంగా హైదరాబాద్ డెక్కన్ స్టేషన్ అని కూడా పిలుస్తారు.
హైదరాబాద్‌లో ఎన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి?
హైదరాబాద్‌లో నాలుగు ముఖ్యమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి.హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి),సికింద్రాబాద్ జంక్షన్,కాచిగూడ స్టేషన్,బేగంపేట స్టేషన్,
ఇవి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పనిచేస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: