Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసు అనూహ్య మలుపు తిరిగింది. తోటి విద్యార్థి వల్లే గర్భం దాల్చానని చెప్పి అసలు నిందితుడిని కాపాడాలనుకున్న బాలిక పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.
నాగర్‌కర్నూల్‌లోని ఓ కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న ఓ స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పదో తరగతి పరీక్షల సమయంలో పరిచయమైన ఓ బాలుడి వల్లే తాను గర్భవతిని అయ్యానని బాలిక తెలిపింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు బాలికతో పరిచయం, చాటింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ, అంతకుమించి మరేమీ లేదని బాలుడు స్పష్టం చేశాడు.
Read Also: Kalvakuntla Kavitha: తిరుమలకు బయలుదేరిన కవిత
డీఎన్ఏ పరీక్ష హెచ్చరికతో బయటపడ్డ నిజాం
పోలీసులకు అనుమానం వచ్చి, బాలికను మరోసారి విచారించారు. నిజానిజాలు తేల్చడానికి శిశువుకు, బాలుడికి డీఎన్ఏ (DNA) నిర్వహిస్తామని, ఒకవేళ అది అబద్ధమని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. డీఎన్ఏ పరీక్ష అంటే భయపడిన బాలిక, తాను అబద్ధం చెప్పానని అంగీకరించింది. ఇంటి సమీపంలో నివసించే వివాహితుడైన బంధువే తన గర్భానికి కారణమని ఒప్పుకుంది. వెంటనే పోలీసులు ఆ వివాహితుడిని అదుపులోకి తీసుకోగా, అతడు కూడా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: